Brahmastra Motion Poster: బాలీవుడ్ లో రూపొందుతోన్న బిగ్గెస్ట్‌ యాక్షన్‌, ఫిక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. బాలీవుడ్‌ దర్శకుడు అయాన్‌ ముఖర్జీ రూపొందిస్తున్న ఈ సినిమాలో రణ్‌బీర్‌ కపూర్‌, అలియా భట్‌ జంటగా నటిస్తున్నారు. అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున కీలకపాత్రలు పోషించారు. కరణ్‌ జోహార్‌ నిర్మాత. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా మొదటి పార్ట్‌ మోషన్‌ పోస్టర్‌ శనివారం ఉదయం విడుదలైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"ఈ లోకంలో ఏదో జరుగుతోంది. ఈ విషయం మామూలు మనుషులకు అర్థం కాదు. కొన్ని పురాతన శక్తులున్నాయి. కొన్ని అస్త్రాలున్నాయి" అనే రణ్‌బీర్‌ డైలాగ్‌లతో మోషన్ పోస్టర్ వీడియో ప్రారంభమైంది. "అవన్నీ నీకు ఎందుకు కనిపిస్తున్నాయ్‌.. అసలు నువ్వు ఎవరు శివా?" అంటూ వచ్చే అలియా భట్‌ సంభాషణలతో ఈ మోషన్‌ పోస్టర్‌ రూపుదిద్దుకుంది. 



పాన్‌ ఇండియా చిత్రంగా రూపొందిన ఈ సినిమా మొదటి భాగాన్ని 'బ్రహ్మాస్త్రం.. మొదటిభాగం: శివ' అనే పేరుతో తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. తెలుగు వెర్షన్‌ రాజమౌళి సమర్పణలో వచ్చే ఏడాది (2022) సెప్టెంబరు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. 



 


Also Read: Bangarraaju Song: ఐటమ్ సాంగ్‌లో రెచ్చిపోయిన ఫరియా అబ్దుల్లా.. తండ్రి-కొడుకులతో మాస్ స్టెప్పులు 


Also Read: Siri Eliminated Bigg Boss 5: బిగ్ బాస్ హౌస్ లో ఊహించని ట్విస్ట్.. ఎలిమినేట్ అయిన సిరి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook