Brahmastra Movie Team Promotions in Cash Program: బాలీవుడ్ మేకర్స్ కు గడ్డు రోజులు వచ్చేశాయి. బాలీవుడ్ సినిమాలను అక్కడ ప్రేక్షకులు ఆదరించడం లేదు. పోనీ ఆ సినిమాలను సౌత్ లో అయినా రిలీజ్ చేస్తే ఇక్కడి వారైనా పట్టించుకుంటున్నారా అంటే విడుదల చేసిన ఒకటి రెండు సినిమాలు దారుణమైన ఫలితాలు తెచ్చుకోవడంతో బాలీవుడ్ మేకర్స్ ఇప్పుడు ఆలోచనలో పడ్డారు. అందుకే పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయాలనుకున్న సినిమాలను తెలుగు రాష్ట్రాలలో కూడా భారీ ఎత్తున ప్రమోట్ చేసుకునే పనిలో పడ్డారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అసలు విషయం ఏమిటంటే రణబీర్ కపూర్ హీరోగా ఆలియా భట్ హీరోయిన్గా బ్రహ్మస్త్రం అనే ఒక సినిమా రిలీజ్ అవుతుంది. పాన్ ఇండియా లెవెల్ లో భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమాను తెలుగు సహా దక్షిణాది భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ నిమిత్తం ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా గ్రాండ్ గా ప్లాన్ చేశారు. అది ఫెయిల్ అయింది. అయితే ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సుమ యాంకర్ గా వ్యవహరించి క్యాష్ షో లో కూడా హీరో హీరోయిన్లు సహా దక్షిణాదిలో సినిమాని రిలీజ్ చేస్తున్న రాజమౌళి కూడా పాల్గొనడం ఆసక్తికరంగా మారింది.


సుమ యాంకరింగ్ చేసే ఈ క్యాష్ ప్రోగ్రామ్ కు మంచి క్రేజ్ ఉంది. కానీ తెలుగులో టైర్ 2 హీరోలలో కొంత మంది కూడా ఈ షోకి హాజరు కాలేదు. ఇక స్టార్ హీరోల సంగతి సరే సరి. అలాంటిది ఒక బాలీవుడ్ స్టార్ హీరో తన సినిమాని ప్రమోట్ చేసుకోవడం కోసం ఈ క్యాష్ ప్రోగ్రామ్ కు హాజరవుతున్నాడు అంటే టాలీవుడ్ ప్రేక్షకుల స్థాయి పెరిగిందా? లేదా బాలీవుడ్ సినీ హీరోల రేంజ్ తగ్గిందా? అనే విధంగా కామెంట్లు చేస్తున్నారు కొంత మంది.


అయితే బాలీవుడ్ సినిమాలు సరిగా ఆడటం లేదన్న నేపథ్యంలో అక్కడి మేకర్స్ సినిమా ప్రమోషన్స్ కోసం ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధమవుతున్నారని అందులో భాగంగానే ఒక రీజనల్ ఛానల్ లో వచ్చే గేమ్ షో కి కూడా హాజరవుతున్నారని అంటున్నారు. మరికొందరు ఇదంతా జక్కన్న ప్లాన్ అని ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ సమయంలో కూడా అలాగే బాలీవుడ్లో పలు షోస్ కి తారక్, రామ్ చరణ్ ఇద్దరిని తీసుకెళ్లి వారి మీద నార్త్ లో కూడా క్రేజ్ ఏర్పడేలా చేశాడని ఇప్పుడు అదేవిధంగా కూడా తెలుగు షోస్ కు వారిని తీసుకువచ్చి తెలుగువారికి దగ్గరయ్యే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని అంటున్నారు. మొత్తం మీద ఈ వ్యవహారం మాత్రం ఒక రకంగా హాట్ టాపిక్ గా మారిందని చెప్పక తప్పదు.


Also Read:  Jalsa 4K All time Record: ఆల్ టైం రికార్డులు బద్దలు కొట్టిన జల్సా రీ రిలీజ్ కలెక్షన్స్


Also Read: Anchor Lasya Hospitalised: యాంకర్ లాస్యకు అస్వస్థత.. హాస్పిటల్లో చేరిక!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి