Jalsa 4K All time Record: ఆల్ టైం రికార్డులు బద్దలు కొట్టిన జల్సా రీ రిలీజ్ కలెక్షన్స్

Jalsa Creates All time Record in Re Release Collections: జల్సా సినిమా రీ రిలీజ్ విషయంలో కూడా రికార్డులు బద్దలు కొడుతోంది.  ఆ వివరాలు

Written by - Chaganti Bhargav | Last Updated : Sep 3, 2022, 07:56 PM IST
Jalsa 4K All time Record: ఆల్ టైం రికార్డులు బద్దలు కొట్టిన జల్సా రీ రిలీజ్ కలెక్షన్స్

Jalsa Creates All time Record in Re Release Collections: ఇప్పుడు తెలుగులో బాగా రీ రిలీజ్ సినిమాలు హవా చూపిస్తున్నాయి. ఇప్పటివరకు ఇలా సినిమాలు రీ రిలీజ్ చేసిన ఘటనలు చాలా తక్కువగా ఉండేవి. కేవలం ఏదైనా పండుగల సందర్భంగా లేదా శివరాత్రి లాంటి పర్వదినాల నేపథ్యంలోనే సినిమాలు రీ రిలీజ్ చేస్తూ ఉండేవారు. కానీ ఈ ఏడాది మొట్టమొదటిసారిగా మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా పోకిరి, ఒక్కడు లాంటి సినిమాలను పలుచోట్ల రీ రిలీజ్ చేశారు. దీంతో ఈ ట్రెండు ఊపు అందుకుంది.

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు నేపద్యంలో ఘరానా మొగుడు సినిమాని విడుదల చేశారు. అయితే ఎందుకో గాని చిరంజీవి అభిమానులు ఈ సినిమా మీద ఆసక్తి చూపించలేదు. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జల్సా సినిమాతో పాటు తమ్ముడు అనే సినిమాను కూడా చాలా చోట్ల రీ రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా మహేష్ బాబు సినిమా రికార్డులను బద్దలు కొట్టినట్లు తెలుస్తోంది. పోకిరి సినిమా నైజాం ప్రాంతంలో మొత్తం మీద 69 లక్షలు వసూలు చేస్తే జల్సా సినిమా ఒక్కటే సుమారు కోటి పాతిక లక్షల రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది.ఇక పోకిరి సినిమా ప్రపంచవ్యాప్తంగా కోటి 73 లక్షలు వసూలు చేసింది. 

జల్సా సినిమా కేవలం నైజాం ప్రాంతంలో కోటి పాతిక లక్షలు వసూలు చేసిందని మిగతా అన్ని ప్రాంతాలలో కూడా ఈ సినిమా వసూళ్లు రచ్చ లేపుతున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.  జల్సా మొత్తం ప్రపంచ వ్యాప్తంగా మూడు కోట్ల 20 లక్షలు కలెక్ట్ చేసింది.  అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావాలనే సినిమా షోలను పెంచి నిజంగా షోలు ఫుల్ అయినా అవ్వకపోయినా ఫుల్ షోలకు ఎంత కలెక్షన్స్ వస్తాయో అంత కలెక్షన్స్ వచ్చినట్లే చెబుతున్నారని హౌస్ ఫుల్ కూడా అవ్వక పోయినా ఇలా ప్రచారం చేయడం కరెక్ట్ కాదని సోషల్ మీడియాలో మహేష్ బాబు ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.

 

మొత్తం మీద ఏదైతే నేమి ఈ రీ రిలీజ్ సినిమాలు ఇప్పుడు కొత్తగా రిలీజ్ అవుతున్న సినిమాల కంటే ఎక్కువ కలెక్షన్లు సాధించడం అనేది ఆసక్తికరంగా మారింది. నిజానికి ఆ సినిమాలు యూట్యూబ్ సహా పలు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో అందుబాటులో ఉన్నాయి. అయినా సరే ఇలా థియేటర్లకు వచ్చి చూడటానికి అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు.

Also Read: Crores Wasted For Brahmastra Event: బ్రహ్మాస్త్రం ఈవెంట్ పర్మిషన్ క్యాన్సిల్ వలన ఎన్ని కోట్లు నష్టమో తెలుసా?

Also Read: Brahmastra Pre Release Event: ఏదైనా తప్పు మాట్లాడితే క్షమించండి.. ఇంకా బాగా నేర్చుకుంటా: రణ్‌బీర్‌ కపూర్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News