Bramayugam First Look: మెగాస్టార్ అంటే చిరంజీవి అని మనందరికి తెలుసు. కానీ, మలయాళ సినీ ఇండస్ట్రీలో మాత్రం మెగాస్టార్ అంటే మమ్ముట్టి గుర్తుకు వస్తారు. ఆయన నటన గురించి తెలుగు వారికి కూడా పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. ఏ పాత్ర అయినా.. చాలా సహజంగా ఒదిగిపోతుంటారు. ఎన్ని పాత్రలు చేసినా.. దానికి తగిన న్యాయం చేయడంలో ఆయన సిద్ధహస్తులు. ఏ హీరో చేయని విభిన్న కథలను ఎంచుకొని ఆయన అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలాంటి కొత్త కొత్త కథాంశాలతో మెప్పించడమే కాకుండా సూపర్ హిట్ లనూ సొంతం చేసుకున్నారాయన. ఇప్పుడు కూడా అలాంటి ఓ కథతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు మమ్ముట్టి. అటు మలయాళం, తమిళతో పాటు తెలుగులోనూ చాలా మంది ప్రేక్షకులు మమ్ముట్టిని ఇష్టపడుతుంటారు. అయితే నేడు (సెప్టెంబరు 6) మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 


కిర్రాక్ లుక్..
మమ్ముట్టి నటిస్తున్న కొత్త చిత్రం 'భ్రమయుగం' సినిమా నుంచి అప్టేడ్ వచ్చేసింది. ఆయన పుట్టినరోజు సందర్భంగా సినిమాలోని ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. రాహుల్ సదాశివన్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి చక్రవర్తి రామచంద్ర, శశికాంత్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో మమ్ముట్టి లుక్ అదరిపోయింది. 60 ఏళ్ల ముసలి వ్యక్తి పాత్రలో ఆయన కనిపించారు. 


Also Read: Savings Account: మీ అకౌంట్‌లో డబ్బులు కట్ అవుతున్నాయా..? వెంటనే ఇలా చేయండి  


బ్లాక్ అండ్ వైట్ తో పాటు కలర్ మిక్స్ చేసిన పోస్టర్ లో గారపట్టిన పళ్లు, గడ్డం, కుర్చీలో కూర్చొన్న మమ్ముట్టి నవ్వుతూ కనిపించారు. సడెన్ గా చూసిన వారు మమ్ముట్టిని గుర్తు పట్టడం కష్టమే అని చెప్పాలి. అంతలా ఆయన వేషధారణ మారిపోయింది. ఈ పోస్టర్ చూసి సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 
తెలుగు తెరకు పరిచయమే..


తెలుగులో 'యాత్ర' సినిమాలో నటించిగా.. ఇటీవలే అక్కినేని అఖిల్ నటించిన ఏజెంట్ సినిమాలో మమ్ముట్టి కూడా ఓ కీలక పాత్ర పోషించారు. అయితే ఈ సినిమాకు చెప్పుకోదగ్గ స్పందన రాకపోయినా.. మమ్ముట్టి నటన మాత్రం విమర్శకులు ప్రశంసలను అందుకుంది.


Also Read: Happy Janmashtami Wishes 2023: శ్రీకృష్ణుడి చల్లని అనుగ్రహం కలగాలని కోరుకుంటూ..ఇలా మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు శుభాకాంక్షలు తెలియజేయండి..  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook