Savings Account: మీ అకౌంట్‌లో డబ్బులు కట్ అవుతున్నాయా..? వెంటనే ఇలా చేయండి

SBI Savings Account News: చాలా మందికి ఇన్సూరెన్స్ పేరుతో స్టేట్ ఆఫ్ బ్యాంక్ ఇండియాలో డబ్బులు కట్ అవుతున్నాయి. తన అకౌంట్‌లో రూ.23,451 కట్ అయినట్లు ఓ కస్టమర్‌ ఎస్‌బీఐకి ఫిర్యాదు చేశాడు. మీ అకౌంట్‌లో కూడా ఇలా కట్ అవుతుంటే ఇలా చేయండి..   

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 7, 2023, 12:27 PM IST
Savings Account: మీ అకౌంట్‌లో డబ్బులు కట్ అవుతున్నాయా..? వెంటనే ఇలా చేయండి

SBI Savings Account News: మీరు బ్యాంకులలో లోన్ కోసం వెళితే కచ్చితంగా ఇన్సూరెన్స్ తీసుకోవాలని కండీషన్ పెడతారు. తమకు బయట బీమా ఉందన్నా.. తమ బ్యాంకులో తీసుకోవాల్సిందేనని చెబుతారు. దీంతో కొందరు బలవంతంగా ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు. ఇక కొందరు అయితే తమ అంగీకారం లేకుండానే బీమా ప్రీమియంల కోసం తమ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతున్నాయని ఫిర్యాదు చేశారు. ఇలాంటి వాటిపై ఎస్‌బీఐ ఖాతాదారులు ఇటీవల సోషల్ మీడియాలో ఫిర్యాదు చేస్తున్నారు. తన సేవింగ్స్ ఖాతా నుంచి రూ.23,451 డెబిట్ అయ్యాయని ఓ కస్టమర్ ఎస్‌బీఐకి కంప్లైంట్ చేశాడు. 

అయితే బీమా, ఇతర పెట్టుబడి ఉత్పత్తులను ఎంచుకోవడం పూర్తిగా కస్టమర్ల ఇష్టమని అని బ్యాంక్ చెబుతోంది. కస్టమర్లు అనుమతి లేకుండా ఏదైనా లావాదేవీ జరిగితే వినియోగదారులు ఫిర్యాదు నమోదు చేయవచ్చని సూచించింది. “బీమా, ఇతర పెట్టుబడులను ఎంచుకోవడం పూర్తిగా వినియోగదారుల ఇష్టం. మా బ్రాంచ్‌లు మా కస్టమర్‌ల ప్రయోజనం, అవగాహన కోసం సమాచారాన్ని అందజేస్తాయి. కస్టమర్‌లకు సేవలను అందించేటప్పుడు మేము ఉన్నత ప్రమాణాల నైతికతను పాటిస్తాం. కస్టమర్ ఖాతాలో  సమ్మతి లేకుండా ఎలాంటి లావాదేవీ జరగదు. మా నుంచి ఏ రకమైన సేవను పొందేందుకు బీమా లేదా పెట్టుబడి తప్పనిసరి కాదని కూడా గమనించండి" అని ఎస్‌బీఐ పేర్కొంది.

మీ ఖాతాలో బీమా పాలసీలు లేదా ఇతర పెట్టుబడి ఉత్పత్తుల కోసం డబ్బులు కట్ అయి ఉంటే crcf.sbi.co.in పోర్టల్‌లో ఫిర్యాదు చేయవచ్చు. వ్యక్తిగత విభాగం/వ్యక్తిగత కస్టమర్‌గా- జనరల్ బ్యాంకింగ్>> ఖాతాల నిర్వహణ> వివాదాస్పద డెబిట్/క్రెడిట్ లావాదేవీ, ఇష్యూకి సంబంధించిన సంక్షిప్త వివరాలను చివరి కాలమ్‌లో పేర్కొనాలి. తమ సిబ్బంది కంప్లైంట్‌ను పరిశీలిస్తుందని ఎస్‌బీఐ తెలిపింది. 

కాగా ఇటీవల బీమా పాలసీలు, యులిప్‌లు, మ్యూచువల్ ఫండ్స్ వంటి కొన్ని పెట్టుబడి ప్రొడక్ట్స్‌ను బ్యాంకులు అనవసరంగా కొనుగోలు చేయిస్తున్నాయి. వినియోగదారులు తమకు అవసరం లేని పాలసీలు లేదా ఉత్పత్తులకు దూరంగా ఉండాలని సూచించింది. ఒకవేళ మీ అనుమతి లేకుండా మీ అకౌంట్‌లో డబ్బులు కట్ అయితే.. వెంటనే సంబంధిత బ్యాంకుకు ఫిర్యాదు చేయాలని లేదా ఆర్‌బీఐ బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌ను సంప్రదించండి. 

Also Read: Miss Shetty Mr Polishetty Twitter Review: శెట్టి కాంబో హిట్ కొట్టిందోచ్.. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ట్విట్టర్ టాక్ ఇదే..!   

Also Read: Shri Krishna Janmashtami 2023: శ్రీకృష్ణుడి వీడ్కోలు తరువాత తల్లిదండ్రులకు ఏమయ్యారు..? ఆ నలుగురు ఎలా చనిపోయారు..?  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News