RRR First Review: ఇండియా బాక్సాఫీస్ షేక్ అవుతుంది.. 3 వేల కోట్లు పక్కా! ఇది రాసిపెట్టుకోండి.. ఆర్ఆర్ఆర్ తొలి రివ్యూ!!
RRR Movie first review. తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమా మొదటి రివ్యూ వచ్చేసింది. ఆర్ఆర్ఆర్ సినిమాకు కలరిస్ట్‌గా పని చేసిన శివకుమార్ బీవీఆర్ ఇచ్చిన రివ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ అయింది.
Colorist shivakumar BVR gives RRR Movie first review: దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన సినిమా 'ఆర్ఆర్ఆర్' (రౌద్రం రణం రుధిరం). కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి కారణంగా ఎన్నో వాయిదాల తరువాత ఆర్ఆర్ఆర్ సినిమా ఎట్టకేలకు మార్చి 25న విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పించాయి. సినిమా విడుదలకు సమయం దగ్గరపడిన నేపథ్యంలో యావత్ భారతావనికి ఆర్ఆర్ఆర్ మేనియా పట్టుకుంది. ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామని అందరూ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమా మొదటి రివ్యూ వచ్చేసింది. ఆర్ఆర్ఆర్ సినిమాకు కలరిస్ట్‌గా పని చేసిన శివకుమార్ బీవీఆర్ ఇచ్చిన రివ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ అయింది. ఆర్ఆర్ఆర్ భారతీయ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందని, మూడు వేల కోట్ల రూపాయలకు పైగా కలెక్ట్ చేస్తుందని చెప్పారు. 'ఇప్పుడే ఆర్ఆర్ఆర్ సినిమా చూశా. కలరిస్ట్‌గా ఒక్కో ఫ్రేమ్ వెయ్యిసార్లు చూశాను. సాధారణ ప్రేక్షకుడిగా లాస్ట్ కాపీ చూసినప్పుడు బాగా ఎమోషనల్ అయ్యాను. ఈ సినిమా అన్ని రికార్డులను బ్రేక్ చేస్తుంది. భారతీయ బాక్సాఫీస్‌లో కొత్త రికార్డ్స్ వస్తాయి. ఆర్ఆర్ఆర్ 3000 కోట్లకు పైగా వసూలు చేస్తుంది. ఇది రాసిపెట్టుకోండి' అని శివకుమార్ ట్వీట్ చేశారు.
శివకుమార్ బీవీఆర్ ఇచ్చిన రివ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ రివ్యూపై ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం 3000 కోట్లు వసూలు చేస్తుంది అనడం కాస్త ఆశ్చర్యంగా ఉందని కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాపై అంతకుమించి అంచనాలు ఉన్నాయి. బాహుబలి సినిమాతో ఇప్పటికే నిరూపించుకున్న రాజమౌళి ప్రతిభపై ఎవరికీ సందేహాలు లేవు. అయితే ఎంత వసూల్ చేస్తుందనే ఇక్కడ అసలు మ్యాటర్.
మార్చి 25న ఆర్ఆర్ఆర్ విడుదల అవుతోంది. అమెరికాలో అయితే 24నే విడుదల అవనుంది. ఇప్పటికే అక్కడ రెండు మిలియన్ ధరలకు పైగా వసూలు చేసి.. మూడు మిలియన్ డాలర్స్ దిశగా దూసుకువెళుతోంది. మన దగ్గర కూడా 24న పెయిడ్ ప్రీమియర్లు వేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. భారత్‌లో ఐదు భాషల్లో సినిమా విడుదల అవుతోంది. దేశవ్యాప్తంగా సుమారు మూడు వేలకు పైగా థియేటర్లలో సినిమా విడుదల కానుందట.
Also Read: Harmanpreet Kaur: వావ్.. వాట్ ఏ క్యాచ్ హర్మన్‌ప్రీత్! బహుశా జాంటీ రోడ్స్ కూడా పట్టడేమో (వీడియో)!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook