Puneeth Rajkumar Birthday Anniversary: పునీత్ రాజ్ కుమార్‌కు ఘన నివాళి.. థియేటర్లో అభిమానులు చేసిన పనికి అందరూ ఫిదా!

Puneeth Rajkumar Birthday Anniversary. నేడు (మార్చి 17) పునీత్ రాజ్ కుమార్ పుట్టిన‌ రోజు సందర్భంగా ఆయన నటించిన చివరి సినిమా 'జేమ్స్' థియేటర్లో విడుద‌ల‌యింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 17, 2022, 10:54 AM IST
  • పునీత్ రాజ్ కుమార్‌కు ఘన నివాళి
  • సీట్లో కూర్చోకుండా సినిమా చూసిన ఫాన్స్
  • థియేటర్లో అభిమానులు చేసిన పనికి అందరూ ఫిదా
Puneeth Rajkumar Birthday Anniversary: పునీత్ రాజ్ కుమార్‌కు ఘన నివాళి.. థియేటర్లో అభిమానులు చేసిన పనికి అందరూ ఫిదా!

Fans enjoys Power Star Puneeth Rajkumar last film James: పునీత్ రాజ్ కుమార్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. క‌న్న‌డ జ‌నాల్లో పునీత్ పేరు ఓ సంచలనం. పునీత్ నటన, అభిన‌యం చూసి మంత్రముగ్ధులైపోయిన జ‌నం.. ఆయ‌న మాన‌వ‌త్వానికి ఫిదా అయిపోయారు. అయితే ఎప్పుడూ చిరున‌వ్వుల‌తో క‌నిపించిన పునీత్.. అభిమానుల‌ను శోక‌సంద్రంలో ముంచి వెళ్లిపోయారు. అయినా కూడా ఆయన న‌వ్వు మాత్రం అభిమానుల హృద‌యాల్లో చెరిగిపోలేదు. పునీత్ ఇక రాడ‌ని తెలిసిన గుండెలు అవిసిపోయేలా ఏడ్చి అల‌సిపోయిన వారంద‌రికీ ఊర‌ట క‌లిగిస్తూ.. పవర్ స్టార్ చివరి సినిమా రిలీజ్ అయింది. నేడు (మార్చి 17) పునీత్ రాజ్ కుమార్ పుట్టిన‌ రోజు సందర్భంగా 'జేమ్స్' సినిమా థియేటర్లో విడుద‌ల‌యింది.

పునీత్ రాజ్ కుమార్‌ చివరి సినిమా 'జేమ్స్‌' ఏకంగా 4 వేల స్క్రీన్స్‌లో విడుదల అయింది. ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో రిలీజ్ అయింది. పునీత్‌కు నివాళిగా మార్చి 17 నుంచి 23 వరకు ఏ చిత్రాన్ని విడుదల చేయకూడదని కర్ణాటక మూవీ డిస్ట్రిబ్యూటర్లు నిర్ణయించుకున్నారు. ఈ రోజు ఉదయమే కర్ణాటకలో జేమ్స్‌ సినిమా ప్రీమియర్ షో పడింది. పునీత్‌కు నివాళి అర్పించిన ఫాన్స్.. సీట్లలో కూర్చోకుండా సినిమా చూశారు. సినిమా మొత్తం వారు నిల్చునే చూసారు. దీనికి అందరూ ఫిదా అవుతున్నారు. 

క‌న్న‌డ న‌ట‌సార్వ‌భౌముడు రాజ్ కుమార్ చిన్న కొడుకే పునీత్ రాజ్ కుమార్. 1975 మార్చి 17న పునీత్ చెన్నైలో జ‌న్మించారు. ఐదేళ్ల ప్రాయంలోనే ఆయన ఇండస్ట్రీలోకి వచ్చారు. అనేక చిత్రాల‌లో బాల‌న‌టునిగా చేసి.. ప‌ది సంవ‌త్స‌రాల ప్రాయంలో ఉత్త‌మ బాల‌న‌టునిగా జాతీయ అవార్డును అందుకున్నారు. తన తండ్రి, అన్నయ్యలు కూడా ఆ ఘనత అందుకోలేకపోవడంతో క‌న్న‌డనాట‌ పునీత్‌క ప్ర‌త్యేక గుర్తింపు వచ్చింది. ఇక హీరోగా చాలా విజయాలు అందుకున్నారు. అభి, వీర‌క‌న్న‌డిగ‌, మౌర్య‌, ఆకాశ్, అజ‌య్, అర‌సు, వంశీ, మిల‌న‌, రామ్, హుడుగ‌రు, జాకీ, రాజ‌కుమార‌, అంజ‌నీపుత్ర‌ వంటి చిత్రాలు ఆయనను అగ్రస్థానంలో నిలబెట్టాయి. 

క‌న్న‌డనాట అత్య‌ధిక పారితోషికం పుచ్చుకుంటున్న పునీత్ రాజ్ కుమార్.. 2021 అక్టోబ‌ర్ 29న హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు. పునీత్ అకాల మరణాన్ని ఇంకా కన్నడిగులు జీర్ణించుకోలేకపోతున్నారు. 46 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో చనిపోవడాన్ని అతని కుటుంబ సభ్యులతో పాటు ప్రేక్షకులు నమ్మలేకపోతున్నారు. ఇప్పటికీ ఆయన జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఈరోజు ఆయన పుట్టిన‌ రోజు కాబట్టి ఫాన్స్ మరింత ఎమోషనల్ అవుతున్నారు. 'జేమ్స్' సినిమా పునీత్ అభిమానులను సేద తీరుస్తుంద‌ని అందరూ భావిస్తున్నారు. 

Also Read: Harmanpreet Kaur: వావ్.. వాట్ ఏ క్యాచ్ హర్మన్‌ప్రీత్! బహుశా జాంటీ రోడ్స్ కూడా పట్టడేమో (వీడియో)!!

Also Read: Gold and Silver Rates Today: మగువలకు శుభవార్త.. తగ్గిన బంగారం ధర! నేటి పసిడి, వెండి రేట్లు ఇవే!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

Trending News