Buddha Venkanna Strong Counter to Ram Gopal Varma: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ మధ్యకాలంలో చేస్తున్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ మధ్య ఏపీ సీఎం జగన్ ను  కలిసి వచ్చిన తర్వాత ఆయన జగన్ కు అనుకూలంగా సినిమాలు చేస్తారంటూ పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ ఆయనను టార్గెట్ చేస్తోంది. అయితే రాంగోపాల్ వర్మ మాత్రం ఎప్పటిలాగే పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ కొన్ని ట్వీట్లు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పవన్ కళ్యాణ్ కాపులను కమ్మలకు అంటే చంద్రబాబుకు అమ్మేస్తున్నారు అని అర్థం వచ్చేలా వర్మ చేసిన ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ విషయం మీద ఒక పక్క పవన్ అభిమానులు మరొక పక్క జనసేన కార్యకర్తలు వర్మకు కౌంటర్లు ఇచ్చేందుకు ప్రయత్నిస్తుండగా తెలుగుదేశం సీనియర్ నేత బుద్ధా వెంకన్న రంగంలోకి దిగి వర్మ మీద చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. వర్మ గురించి ప్రస్తావిస్తూ బుద్ధా వెంకన్న నువ్వు కామంతో కాళ్లు నాకేవనుకున్నా కానీ పేటీఎం డబ్బు కోసం ఏమైనా నాకుతావని ఊహించలేదు రెస్ట్ ఇన్ పీస్ రాంగోపాల్ వర్మ కంగ్రాట్స్ జగన్ రెడ్డి అంటూ పేర్కొన్నారు.


అయితే ఈ విషయాన్ని మూడు రోజుల తర్వాత ఆలస్యంగా గమనించిన రాంగోపాల్ వర్మ దానికి ఘాటుగా స్పందించారు. ఒసేయ్ ఎంకమ్మ(వెంకన్నను అలా సంబోధించారు), నేను ఒక అందమైన అమ్మాయి కాలిని పబ్లిక్ గా నాకాను, నువ్వు ప్రైవేటుగా నీ బాసును సుఖపెట్టడానికి ఎక్కడ నాకుతావో పబ్లిక్ అందరికీ తెలుసు కదా బేబీ ఉమ్మా అంటూ ట్వీట్ చేశారు. ఆ తర్వాత ఒసేయ్ ఎంకమ్మ మనలో మన మాట ఇలా నాకడం నేను ఎంజాయ్ చేసినంత నువ్వు కూడా అంతే ఎంజాయ్ చేస్తావా? వీలుంటే నీ వీడియో కూడా నాకి డైరెక్ట్ మెసేజ్ లో పెట్టు బుద్ధా డార్లింగ్ అంటూ తాను అషు రెడ్డి కాలిని నాకుతున్న వీడియోని మరోసారి వర్మ షేర్ చేశారు.


దానికి బుద్ధా వెంకన్న మరోసారి కౌంటర్ ఇచ్చారు ఒకప్పుడు నిన్ను చూస్తే శివ సినిమా గుర్తుకొచ్చి రోమాలు నిక్కబొడుచుకునేవి కానీ ఇప్పుడు నిన్ను చూస్తుంటే ఇదిగో ఈ వీడియో గుర్తొస్తుంది అంటూ ఆగడు సినిమాలో ఒక వీడియో క్లిప్ షేర్ చేశారు. అంటే ఆశిష్ విద్యార్థి పోషించిన గే పాత్ర గురించి ఎమ్మెస్ నారాయణ క్లారిటీ ఇస్తున్న వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో విషయం లేనప్పుడే పబ్లిసిటీ పీక్స్ లో ఉంటుందని ఎమ్మెస్ నారాయణ చేస్తున్న కామెంట్లు ఇప్పుడు వర్మను చూస్తే గుర్తొస్తున్నాయని బుద్ధా వెంకన్న పేర్కొనడం హాట్ టాపిక్ గా మారింది. 
Also Read: Balakrishna on Chandrababu:'బాబు బావ'ను ఆకాశానికెత్తేసిన బాలయ్య.. 'రాయల్' అంటూ కామెంట్లు!


Also Read: Vijay Craze: తెలుగు రిలీజ్ లేకున్నా విజయ్ జోరు.. 'తునివు'ని వెనక్కు నెట్టి మరీ!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook