Balakrishna on Chandrababu:'బాబు బావ'ను ఆకాశానికెత్తేసిన బాలయ్య.. 'రాయల్' అంటూ కామెంట్లు!

Balakrishna Comments on Chandrababu : నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమా సంక్రాంతి కానుకగా వచ్చేసింది, అయితే ఈ సినిమాలో బాలకృష్ణ తన బావ చంద్రబాబు గురించి పలికిన డైలాగులు వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు

Written by - Chaganti Bhargav | Last Updated : Jan 12, 2023, 02:27 PM IST
Balakrishna on Chandrababu:'బాబు బావ'ను ఆకాశానికెత్తేసిన బాలయ్య.. 'రాయల్' అంటూ  కామెంట్లు!

Balakrishna Comments on Chandrababu Goes Viral in Veera Simha Reddy Movie: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11వ తేదీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికే ఈ సినిమా అనేక చోట్ల ప్రదర్శితం అవుతూ ఉండగా సినిమాకి మిశ్రమ స్పందన లభిస్తోంది. సినిమా అద్భుతంగా ఉందని బాలకృష్ణ అభిమానులు చెబుతుంటే కామన్ ఆడియన్స్ మాత్రం ప్యూర్ బాలకృష్ణ మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ అని అంటున్నారు.

అయితే ఈ సినిమాలో బాలకృష్ణ పలికిన కొన్ని డైలాగులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసినట్లు అనిపిస్తోందని సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. అభివృద్ధి పేరుతో బాలకృష్ణ పలికిన డైలాగులు ఏపీ ప్రభుత్వాన్ని పరోక్షంగా టార్గెట్ చేశాయని అంటున్నారు. మరోపక్క రాయలసీమ గురించి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సంస్కారం లేక రాయలసీమ వెనక పడింది అనే డైలాగ్ కి ప్రతిస్పందనగా నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి.

దేశానికి ఒక రాష్ట్రపతిని ఇచ్చింది రాయలసీమ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ఆరుగురు ముఖ్యమంత్రులను ఇచ్చింది రాయలసీమ, తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం పిడికిలి బిగించిన వ్యక్తికి దన్నుగా నిలిచింది రాయలసీమ, ఆంధ్రప్రదేశ్ ను ప్రపంచ పటంలో పెట్టిన విజనరీని అందించింది రాయలసీమ, మాది రాయలసీమ కాదు రాయల్ సీమ అంటూ బాలకృష్ణ పలికిన డైలాగులు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

తెలుగు వాడైన మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి సహా రాయలసీమ నుంచి ముఖ్యమంత్రిగా పని చేసిన వాళ్ళను ప్రస్తావిస్తూ తన బావ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేరును పరోక్షంగా ఆయన ప్రస్తావించినట్లు ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి ఎందుకంటే టీడీపీ ఎప్పుడూ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఉంటుంది. ఇప్పుడు బాలకృష్ణ కూడా తన బావను సినిమా ద్వారా ప్రమోట్ చేయడం గమనార్హం. 

Also Read: Chiranjeevi: మెగాస్టార్ చిరుపై విష ప్రయోగం, ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది..వైరల్ అవుతున్న వార్త

Also Read: Balakrishna Target: ఏపీ ప్రభుత్వం మీద వీర సింహా రెడ్డి సెటైర్లు.. వెధవలు అంటూ ఘాటుగా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News