2018 Movie Break Even ఈ మధ్యకాలంలో భాషతో సంబంధం లేకుండా మంచి సినిమా ఏ భాషలో రిలీజ్ అయినా ఆ భాషలోనే సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ప్రేక్షకులు. అయితే దర్శక నిర్మాతలు కూడా ఇతర భాషల్లో సూపర్ హిట్ లుగా నిలిచిన సినిమాలను అయితే డబ్బింగ్ చేయించి రిలీజ్ చేయడం లేకపోతే రీమేక్ హక్కులు కొనుగోలు చేసి తమ తమ ఫ్లేవర్ కు తగ్గినట్టుగా రీమేక్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే తమిళ కన్నడ భాషల నుంచి అనేక సినిమాలను డబ్బింగ్ చేసి తెలుగులో రిలీజ్ చేయగా బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలుస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మొట్టమొదటిసారిగా ఒక మలయాళ బ్లాక్ బస్టర్ సినిమాని కూడా తెలుగులో మాత్రమే కాదు తమిళ , కన్నడ,  హిందీ భాషల్లో సైతం డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. కేవలం 10 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కి మలయాళంలో మే 5వ తేదీన విడుదలైన 2018 సినిమా అక్కడ దాదాపు 150 కోట్ల వరకు వసూలు చేసి మలయాళ భాషలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. ఈ సినిమాని బన్నీ వాసు సొంతంగా కొనుగోలు చేసి తెలుగులో రిలీజ్ చేశారు. మొదటిరోజు కోటి రూపాయల మేర కలెక్ట్ చేసిన ఈ సినిమా ఆ తర్వాత రోజు కోటి 70 లక్షల వరకు గ్రాస్ వసూలు చేసింది.


ఆసక్తికరంగా మూడవరోజు ఈ సినిమా వసూళ్లు ఇంకా ఎక్కువ నమోదు కావడం గమనార్హం. సాధారణంగా ఆదివారం కావడంతో ఈ రేంజ్ వసూళ్లు మామూలే అనుకున్నారు.  కానీ ఐపిఎల్ మ్యాచ్ ఉన్నా సరే ప్రేక్షకులు ఈ సినిమా చూసేందుకు ఆసక్తి చూపించడం గమనార్హం. ఇదే విషయాన్ని సినిమా యూనిట్ కూడా గర్వంగా ట్విట్ చేసుకుంది.


Also Read: Mem Famous Review: మహేష్ మెచ్చిన మేం ఫేమస్ రివ్యూ & రేటింగ్.. ఎలా ఉందంటే?


ఇక ఈ సినిమాని రిలీజ్ కి ముందు పెద్దగా ప్రమోట్ చేయకపోయినా రిలీజ్ అయిన తర్వాత మరింత మౌత్ టాక్ జనాల్లోకి తీసుకెళ్లేందుకు గాను తాజాగా ఈ సినిమాలో హీరోగా నటించిన హైదరాబాద్ తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టించారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని సినిమా యూనిట్ భావిస్తోంది. నిజానికి ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ పూర్తిచేసుకుని హిట్గా నిలిచింది. వారి అంచనా మేరకు ఈ సినిమా మరిన్ని వసూళ్లు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Also Read: Malli Pelli Movie Review: నరేష్-పవిత్రాల మళ్లీ పెళ్లి రివ్యూ అండ్ రేటింగ్.. సినిమా ఎలా ఉందంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK