Spirit Movie Update: ప్రభాస్ ‘స్పిరిట్’కు మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్.. ఎవరంటే?
Spirit Movie Update: ప్రభాస్-సందీప్ రెడ్డి వంగా కాంబోలో ఓ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్ డేట్ ను సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు మేకర్స్.
Prabhas Spirit Movie Update: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుసగా సినిమాల చేస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు. రీసెంట్ గా ఆయన నటించిన 'సలార్' (Salaar) రిలీజ్ కు రెడీ అవుతుండగా.. మరోపక్క ‘కల్కి 2898’ శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. దీనికి 'స్పిరిట్' (Spirit Movie)అని టైటిల్ పెట్టారు. ఈ ఏడాది చివరిలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశముందని టాక్ వినిపిస్తోంది.
తాజాగా ఈ మూవీ నుంచి ఓ అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్(Harshavardhan Rameshwar) సంగీతాన్ని అందించబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ‘అర్జున్ రెడ్డి’ చిత్రానికి కూడా ఈయనే మ్యూజిక్ చేశారు. ఈ చిత్రం పోలీస్ డ్రామాగా తెరకెక్కబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని ఎనిమిది భాషల్లో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా హిందీలో రణబీర్‌కపూర్‌తో ‘యానిమల్’ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు.ఈ మూవీ పూర్తవ్వగానే స్పిరిట్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.
డార్లింగ్ ప్రభాస్- కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన సినిమా సలార్. ఇందులో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ సినిమా సెప్టెంబరు 28న రిలీజ్ కానుంది. ఈ మూవీలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, శ్రియా రెడ్డి, ఈశ్వరరావు తదితరులు కీ రోల్స్ చేశారు. రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇది రెండు భాగాలుగా రాబోతుంది. మెుదటి భాగానికి 'సలార్: పార్ట్ 1 సీజ్ ఫైర్' అని పేరు పెట్టారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, టీజర్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి.
మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ కాంబోలో ప్రభాస్ చేస్తున్న సినిమా కల్కి 2898 ఏడీ. ఈ మధ్యే శాన్ డీగో కామిక్ కాన్ లో మూవీ టైటిల్ తోపాటు గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ప్రచార చిత్రం అయితే హాలీవుడ్ రేంజ్ లో ఉంది. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సి.అశ్వినీదత్ సుమారు రూ.600 కోట్లతో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇది కూడా రెండు పార్టులుగా వస్తుంది.
Also Read: Chandramukhi 2 First Single: ‘చంద్రముఖి-2’ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook