Actress Karate Kalyani: క్యారెక్టర్ ఆర్టిస్ట్ కరాటే కళ్యాణిపై జగద్గరిగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ హత్య కేసుకు సంబంధించి సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించినట్లు ఫిర్యాదు అందడంతో ఆమెపై ఎఫ్ఐఆర్ (FIR on Karate Kalyani) నమోదు చేశారు పోలీసులు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళితే...
గతంలో సైదాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలోని  సింగరేణి కాలనీలో ఓ మైనర్ బాలిక హత్య (minor girl murder case)కు గురయ్యింది. హత్య వివరాలను బహిర్గతం చేసేందుకు కరాటే కళ్యాణి (Actress Karate Kalyani) ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి ఏల్లమ్మ బండ ప్రాంతానికి చెందిన తూటంశెట్టి నితేష్ అనే వ్యక్తి రంగారెడ్డి జిల్లా డిస్ట్రిక్ట్ కోర్టులో ప్రైవేట్ గా కంప్లైంట్ దాఖలు చేశాడు. ఫిర్యాదును ప‌రిశీలించిన కోర్టు క‌రాటే క‌ళ్యాణిపై కేసు న‌మోదు చేయాల‌ని జ‌గ‌ద్గిరి గుట్ట (jagadgiri gutta) పోలీసులను ఆదేశించింది. ఆదేశాల ప్ర‌కారం పోలీసులు క‌ళ్యాణిపై కేసు న‌మోదు చేశారు.


Also Read: RRR Cast Remuneration: RRR సినిమాకు తలో రూ.45 కోట్లు తీసుకున్న హీరోలు .. అలియా రెమ్యూనరేషన్ తెలిస్తే షాకే!


క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా, సీరియ‌ల్స్‌లో న‌టిగా క‌ళ్యాణికి మంచి గుర్తింపు ఉంది. సుమారు 250కిపైగా చిత్రాల్లో పలు పాత్రల్లో నటించారు. బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న క‌ళ్యాణి రెండో వార‌మే ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యింది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి