శ్రీరెడ్డి vs లారెన్స్.. లారెన్స్ సవాల్‌కి ఓకే చెప్పిన శ్రీ రెడ్డి!
లారెన్స్ విసిరిన సవాల్‌కి ఓకే చెప్పిన శ్రీరెడ్డి
తనకు సినిమాల్లో అవకాశం కల్పిస్తానని నమ్మించి లారెన్స్ మాస్టర్ తనను శారీరకంగా వాడుకున్నాడు అంటూ నటి శ్రీ రెడ్డి చేసిన పలు ఆరోపణలపై ఎట్టకేలకు స్పందించిన లారెన్స్ మాస్టర్ ఆమెకు ఓ బహిరంగ సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. నిజంగా నీలో నటించే ప్రతిభ, డ్యాన్సింగ్ స్కిల్స్ ఉన్నట్టయితే, తానే ఒకసారి మీడియా వారి సమక్షంలో ఆడిషన్ ఏర్పాటు చేస్తానని, అక్కడ తాను ఇచ్చిన సన్నివేశాలకు నటించి చూపించాలని సవాల్ చేశాడు లారెన్స్. అంతేకాకుండా అందరు నటులు చేసే విధంగానే కొన్ని సాధారణ స్టెప్స్ చేసి చూపించాలని, నీ పర్ఫార్మెన్స్ నచ్చినట్టయితే, అక్కడే నీకు తన తర్వాతి సినిమాలో ఓ మంచి పాత్ర ఆఫర్ చేయడంతోపాటు అడ్వాన్స్ కూడా ఇస్తానని లారెన్స్ తన ఛాలెంజ్‌లో పేర్కొన్నాడు. ఒకవేళ మీడియా ఎదుట ఆడిషన్‌లో పాల్గొనడం ఇష్టం లేకపోయినట్టయితే, నీ తరపున ఓ లాయర్‌తోపాటు, నీ శ్రేయోభిలాషిని ఎవరినైనా వెంట తీసుకుని వచ్చి తన మేనేజర్‌ని కలిసినా సరిపోతుంది అని లారెన్స్ స్పష్టంచేశాడు.
లారెన్స్ మాస్టర్ విసిరిన సవాల్‌ని స్వీకరిస్తున్నానని నిన్న ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టిన శ్రీరెడ్డి.. అందరూ తనని ఆశీర్వదించాల్సిందిగా కోరింది. ఆ తర్వాత ఆ పోస్టుకు కొనసాగింపుగా లారెన్స్ మాస్టర్ కోసం అంటూ ఇవాళ మరో చిన్న వీడియోను పోస్ట్ చేసిందామె.