CBI Notices: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు.. విచారణకు రమ్మంటూ!
CBI Notices to Kalvakuntla Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు జారీ చేయడం కలకలం రేపుతోంది.
CBI Notices to Kalvakuntla Kavitha: గత కొంతకాలంగా తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్న కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. సీఆర్పీసీ సెక్షన్ 160 కింద ఢిల్లీ ఏసీబీ- సీబీఐ దర్యాప్తు చేస్తున్న కేసుకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కోసం ఆమె హాజరవ్వాల్సిందిగా కోరారు..
మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అథారిటీస్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ రాయ్ ఫిర్యాదు మేరకు నమోదు చేసిన ఒక కేసుకు సంబంధించి మీరు విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని ఆమెకు నోటీసుల్లో పేర్కొన్నారు. లిక్కర్ పాలసీకి సంబంధించి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీ సిసోడియా మీద ఈ కేసు నమోదు అయిందని, ఆ కేసుకు సంబంధించి మీరు విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. డిసెంబర్ ఆరో తేదీన హైదరాబాద్ లో ఉంటారా లేక ఢిల్లీలో ఉంటారా? అనే విషయాన్ని మాకు తెలియజేయాలని వీలైనంత వరకు ఢిల్లీలోనే ఉండేందుకు ప్రయత్నించాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
ఇక ఈ విషయాన్ని కలవకుంట్ల కవిత తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు, తనకు సీబీఐ నోటీసులు వచ్చాయని సీఆర్పీసీ సెక్షన్ 160 కింద నా క్లారిఫికేషన్ కోసం ఈ నోటీసులు జారీ చేశారని ఆమె పేర్కొన్నారు. వాళ్లు అభ్యర్థించిన మేరకు నేను హైదరాబాద్ నివాసంలో డిసెంబర్ 6వ తేదీన సీబీఐ అధికారుల ముందు విచారణకు హాజరవుతానని వెల్లడించానని కల్వకుంట్ల కవిత ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇక ఇదే అంశం మీద తాజాగా మీడియాతో మాట్లాడిన ఆమె రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్నాయని ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయోగిస్తుందని అన్నారు.
తనపై కేసులు నీచమైన రాజకీయ ఎత్తుగడ అని ప్రజల కోసం పని చేస్తున్నందుకే పగబట్టి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆమె విమర్శించారు. నాపై తెలంగాణ మంత్రులపై ఎమ్మెల్యేలపై కేసులు పెట్టారని తాను ఎలాంటి విచారణకైనా సిద్ధమే అని పేర్కొన్నారు. కేసులు పెట్టుకోండి అరెస్టులు చేసుకోండి జైల్లో పెడతామంటే పెట్టుకోండి అంతకంటే ఏం చేయగలరు? ఉరి తీస్తారా అంటూ ఆమె ఫైర్ అయ్యారు. మీడియాకు లీకులు ఇచ్చి మా ప్రతిష్ట దెబ్బతీయ లేరని పేర్కొన్న ఆమె దర్యాప్తు సంస్థలు ప్రశ్నలు అడిగితే సమాధానం ఇస్తానని పేర్కొన్నారు.
Also Read: Students attacked: కీచకుడిగా మారిన టీచర్.. చెప్పు దెబ్బలతో బుద్ధి చెప్పిన బాలికలు
Also Read: Samantha:మా సినిమాలో విలన్ గా నటించమన్న అడివిశేష్.. సమంత మైండ్ బ్లాకింగ్ రిప్లై!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook