Girl Students attacked: కీచకుడిగా మారిన టీచర్.. చెప్పు దెబ్బలతో బుద్ధి చెప్పిన బాలికలు!

Girl Students attacked Nizamabad Teacher With Slippers: నిజామాబాద్ లో ఖలీల్ వాడి అనే ఒక ప్రాంతంలో మోడ్ ఎయిడెడ్ పాఠశాలలో విద్యార్థినిలు పట్ల ఒక ఉపాధ్యాయుడు కీచకుడిలా ప్రవర్తిస్తున్న క్రమంలో ఆయన మీద చెప్పులతో దాడి చేసినట్టు తెలుస్తోంది. 

Written by - Chaganti Bhargav | Last Updated : Dec 2, 2022, 09:29 PM IST
Girl Students attacked: కీచకుడిగా మారిన టీచర్.. చెప్పు దెబ్బలతో బుద్ధి చెప్పిన బాలికలు!

Girl Students attacked Nizamabad Teacher With Slippers: ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా ఆడవారిపై లైంగిక దాడులు మాత్రం ఆగడం లేదు. ఏదో ఒక రూపంలో మృగాళ్లు ఆడవాళ్ళపై కన్నేస్తూనే ఉన్నారు. మూడేళ్ల పాప నుంచి కాటికి కాళ్లు చాపిన ముదుసలి వరకు ఎవరిని వదలకుండా మృగాళ్లు తమ కామ వాంఛలకు బలి తీసుకుంటున్నారు.  తాజాగా నిజామాబాద్ జిల్లాలో కూడా ఇలాంటి ఒక ఘటన చోటుచేసుకుంది. అయితే విద్యార్థినిలు అందరూ తమను వేధింపులకు గురి చేస్తున్న తమ ఉపాధ్యాయుడిని చెప్పులతో కొట్టి అతనికి గుణపాఠం చెప్పారు.

అసలు ఈ ఘటనకు సంబంధించిన అన్ని వివరాల్లోకి వెళితే నిజామాబాద్ నగరంలో ఖలీల్ వాడి అనే ఒక ప్రాంతంలో మోడ్ ఎయిడెడ్ పాఠశాలలో విద్యార్థినిలు పట్ల ఒక ఉపాధ్యాయుడు కీచకుడిలా ప్రవర్తిస్తున్న ఘటన శుక్రవారం నాడు వెలుగులోకి వచ్చింది. ఒక విద్యార్థిని చాలాకాలంగా ఓపిక పడుతూ పడుతూ ఇక తట్టుకోలేక తన తల్లిదండ్రులకు అతని గురించి తెలియజేయడంతో వారు పాఠశాలకు వెళ్లి అక్కడ ఉపాధ్యాయుడు రమణను ఈ విషయం మీద ప్రశ్నించారు.

అదే స్కూల్లో బయోలాజికల్ సైన్స్ బోధిస్తున్న రమణ చాలా కాలం నుంచి అలాగే ప్రవర్తిస్తున్నాడని తెలుసుకున్న ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు కూడా సంఘటనా స్థలానికి వచ్చి అతనికి దేహశుద్ధి చేశారు. ఉపాధ్యాయుల రూపంలో ఉన్న ఈ కీచకుడిని ఉరితీయాలని వారు డిమాండ్ చేశారు.

ఇక ఈ రమణ అనే వ్యక్తి కొంతకాలంగా విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఈ విషయాన్ని ప్రధానోపాధ్యాయుడి దృష్టికి తీసుకు వెళ్లినా చర్యలు లేవని అందుకే తల్లిదండ్రుల దృష్టికి తీసుకు వెళ్లడంతో వారంతా వచ్చి దాడి చేశారని తెలుస్తోంది. ఇక ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అతనిని చెప్పులతో కొట్టుకుంటూ తీసుకెళ్లిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read: BJP: బీజేపీలో పదవుల జాతర.. కాంగ్రెస్ నుంచి వచ్చిన ముగ్గురు నేతలకు కీలక పదవులు  

Also Read: జూబిలీ హిల్స్ ట్రాఫిక్ మళ్లింపులపై విమర్శలు.. ట్రాఫిక్ పోలీసులు ఏమంటున్నారంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News