నటీనటులు : నాగ శౌర్య, రష్మిక, నరేష్, రఘుబాబు, పోసాని, వెన్నెల కిశోర్, సత్య , ప్రవీణ్, వైవ హర్ష తదితరులు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సంగీతం– సాగ‌ర్ మ‌హ‌తి


సినిమాటోగ్రఫీ– సాయి శ్రీరామ్‌


నిర్మాత‌– ఉషా ముల్పూరి


సమర్పణ – శంక‌ర ప్రసాద్ ముల్పూరి


కథ – మాటలు-స్క్రీన్ ప్లే- ద‌ర్శకత్వం– వెంకి కుడుముల‌


రిలీజ్ డేట్ : 2 ఫిబ్రవరి2018


రిలీజ్ కి ముందే సాంగ్స్ తో అందరినీ ఎట్రాక్ట్ చేసిన ‘ఛలో’ సినిమా ఈరోజే థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. నాగశౌర్య -రష్మిక జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో యూత్ ఫుల్ ఫన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఎంటర్టైన్ చేసిందో..చూద్దాం.


కథ:


ఆంధ్రా, తమిళనాడు బోర్డర్ కి సరిహద్దుగా ఉండే తిరుప్పురం అనే గ్రామంలో తమిళులు, తెలుగు వాళ్ళకి నిత్యం గొడవలు జరుగుతుంటాయి. ఈ క్రమంలో చిన్నతనం నుండి గొడవలంటే అమితంగా ఇష్టపడుతూ గొడవ అనే పదం వింటే సంబరపడిపోయే వ్యక్తిత్వంతో గల హరి (నాగశౌర్య) అనుకోకుండా తిరుప్పురంలో ఇంజినీరింగ్ పూర్తిచేయడానికి వెళ్తాడు. అయితే కాలేజీలో తనలాగే గొడవలంటే ఇష్టపడే కార్తీక(రష్మిక మండన్న) ని చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. ఇంతకీ హరి ప్రేమించిన కార్తీక కూతురు..? వీళ్ల ప్రేమకు ఆంధ్రా-తమిళనాడు బార్డర్ లో ఉండే ఊరికి ఏంటి సంబంధం.. గోడవలంటే ఇష్టపడే హరి రెండు ఊర్ల మధ్య ఉన్న గొడవను ఎలా సర్దుబాటు చేశాడు. చివరికి తను ప్రేమించిన కార్తీక ఎలా పెళ్లాడాడు..? అనేది సినిమా కథాంశం.


నటీనటుల పనితీరు:


హీరోగా తన లుక్, నేచురల్ పెర్ఫార్మెన్స్ తో ఇప్పటికే తనెంటో నిరూపించుకున్న నాగశౌర్య మరో సారి బెస్ట్ అనిపించుకున్నాడు. కాకపోతే కొన్ని సన్నివేశాల్లో ఇంకా నటుడిగా ఇంప్రూవ్ అయితే బెటర్ అనిపించింది. ఇక ఈ సినిమాతో తెలుగులో అరంగేట్రం చేసిన రష్మిక మండన్న తన గ్లామరస్ పెర్ఫార్మెన్ తో ఎట్రాక్ట్ చేసి సినిమాకు హైలైట్ గా నిలిచింది. తన కామెడీ టైమింగ్, అలాగే స్లాంగ్ తో ఎంటర్ టైన్ చేసి సినిమాకు మరో హైలైట్ గా నిలిచాడు సత్య.


తన డిఫరెంట్ కామెడీ టైమింగ్ తో సోషల్ మీడియాలో హల్చల్ చేసిన సుదర్శన్ ఈ సినిమాతో ఎంటర్టైన్ చేశాడు. ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో కమెడియన్ గా అదుర్స్ అనిపించుకున్నాడు. ఇక ఫస్ట్ హాఫ్ లో వచ్చే పోసాని కామెడీ కూడా బాగా పేలింది. సెకండ్ హాఫ్ లో కాస్త బోర్ అనిపిస్తున్న టైంలో ఎప్పటిలాగే సినిమాను తన కామెడీతో సేఫ్ జోన్లోకి తీసుకెళ్లాడు వెన్నెల కిషోర్. ఇక నరేష్, ప్రవీణ్, ప్రగతి, రాజేంద్రన్, అచ్యుత్ కుమార్, స్వప్నిక, ఈరోజుల్లో సాయి, సంతోష్ తదితరులు తమ క్యారెక్టర్స్ కు పర్ఫెక్ట్ అనిపించుకున్నారు.


టెక్నిషియన్స్ పనితీరు :


సాగర్ మహతి అందించిన మ్యూజిక్ సినిమాకు బిగ్ ఎసెట్ అయ్యింది. చూసీ చూడంగానే, డ్రంక్ అండ్ డ్రైవింగ్, చెప్పవే బాలామణి, అమ్మాయి ఛలో సాంగ్స్ ఆకట్టుకున్నాయి. భాస్కరభట్ల, కాసర్ల శ్యామ్, కృష్ణ మద్దినేని అందించిన లిరిక్స్ బాగున్నాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు తగినట్టుగా అందించి సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలిచాడు సాగర్ మహతి. సినిమాటోగ్రఫీ బాగుంది. ముఖ్యంగా సాంగ్స్ పిక్చరైజేషన్ తో తన ప్రతిభ చాటాడు సాయి శ్రీరామ్. ఎడిటింగ్ బాగుంది. కొన్ని సందర్భాలలో వచ్చే పంచ్ డైలాగ్స్ బాగా ఎంటర్ టైన్ చేశాయి. వెంకీ కుడుముల డైలాగ్స్- స్క్రీన్ ప్లే సినిమాకు ప్లస్ అయ్యాయి. ఐరా క్రియేషన్స్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.


సమీక్ష:
ఈ మధ్య నాగశౌర్య హీరోగా నటించిన సినిమాలు కొన్ని బాక్సాఫీస్ దగ్గర వరుసగా బోల్తా కొట్టాయి… అయితే వరుస అపజయాలు అందుకుంటున్న ఈ టైంలో ఎలాగైనా హీరోగా హిట్ కొట్టాలని గట్టిగా డిసైడ్ అయ్యాడు శౌర్య. అందుకే తనతో కలిసి ఓ సినిమాకి పనిచేసిన స్నేహితుడు వెంకీని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ తన సొంత బ్యానర్ లో ఈ సినిమా చేశాడు.


ఈ సినిమా నుండి రిలీజ్ అయిన మొదటి సాంగ్ ‘చూసి చూడంగానే’ సినిమాపై ఎక్కడలేని హైప్ తీసుకొచ్చింది. రిలీజ్ అయిన గంటల్లోనే ఈ సాంగ్ అందరికీ ఫెవరేట్ గా మరిపోయింది. ఇక టీజర్, ట్రైలర్ కూడా సినిమాపై మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసి ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేలా చేశాయి.
ఇక సినిమా విషయానికొస్తే కథ రోటీనే అయినప్పటికీ తన రైటింగ్ స్కిల్స్, స్క్రీన్ ప్లే తో మేజిక్ చేస్తూ ఎంటర్టైన్ చేశాడు త్రివిక్రమ్ శిష్యుడు వెంకీ కుడుముల.


దర్శకుడిగా తొలి సినిమా అయినప్పటికీ ఎక్కడా తడబడకుండా తన మార్క్ కామెడీతో చివరి వరకూ ఎంటర్టైన్ చేసి దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు.
నాగ శౌర్య పెర్ఫార్మెన్స్, రష్మిక గ్లామర్, ఫస్ట్ హాఫ్ లో వచ్చే సత్య-సుదర్శన్-పోసాని కామెడీ సీన్స్, పంచ్ డైలాగ్స్, సాంగ్స్, ఇంటర్వెల్ ట్విస్ట్, ఎంటర్టైనింగ్ స్క్రీన్ ప్లే, సెకండ్ హాఫ్ వచ్చే వెన్నెల కిషోర్ కామెడీ, ప్రీ క్లైమాక్స్ సినిమాకు హైలైట్స్ గా నిలవగా, రొటీన్ అనిపించే కథ-ఫస్ట్ హాఫ్ లో కాస్త డ్రాగ్ అనిపించే సీన్స్, సెకండ్ హాఫ్ లో బోర్ కొట్టించే సీన్స్, దర్శకుడు కేవలం కామెడీ పై మాత్రమే ఫోకస్ పెట్టి కొన్ని ఎమోషనల్ సీన్స్ & లవ్ ట్రాక్ పై శ్రద్ధ పెట్టకపోవడం, లాజిక్స్ లేకపోవడం సినిమాకు మైనస్.


ఓవరాల్ గా ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా లాజిక్స్ పట్టించుకోకుండా కేవలం ఎంటర్టైన్ మెంట్ కోసం ఛలో చూడొచ్చు.


రేటింగ్: 3/5


(జీ సినిమాలు సౌజన్యంతో)