Chandini Chowdary: మరో డిఫరెంట్ మూవీతో పలకరించనున్న అచ్చ తెలుగు అమ్మాయి చాందినీ చౌదరి..
Chandini Chowdary: టాలీవుడ్లో తెలుగు అమ్మాయిలకు అంతగా స్కోప్ ఉండదు. ఎక్కువగా పరభాష కథానాయికలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఇంత పోటీలో కూడా అచ్చ తెలుగు అమ్మాయి చాందినీ చౌదరి వరుస అవకాశాలతో దూసుకుపోతుంది.
Chandini Chowdary: చాందినీ చౌదరి ప్రస్తుతం తెలుగులో బుల్లెట్‌లా దూసుకువస్తోంది. అంతేకాదు డిఫరెంట్ మూవీస్‌తో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే పనిలో పడింది. విశాఖ పట్నానికి చెందిన ఈమె బెంగళూరులో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసింది. 2012లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' మూవీలో గెస్ట్ పాత్రలో మెరసింది. ఆ తర్వాత 'ప్రేమ ఇష్క్ కాదల్' మూవీలో అంతగా గుర్తింపు లేని క్యారెక్టర్‌లో నటించింది.
2015లో 'కేటుగాడు' మూవీలో కథానాయికగా లీడ్ రోల్లో నటించింది. ఆ తర్వాత మహేష్ బాబు హీరోగా నటించిన 'బ్రహ్మోత్సవం'లో చిన్న కెమియో రోల్లో నటించింది. ఆ తర్వాత 'కుందనపు బొమ్మ', శమంతకమణి, లై, 'హౌరా బ్రిడ్జ్' సినిమాల్లో నటించిన రాని గుర్తింపు సుహాస్‌తో కలిసి నటించిన 'కలర్ ఫోటో' మూవీతో దక్కింది. ఈ సినిమా జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ భాష చిత్రంగా అవార్డు గెలుచుకుంది.
'కలర్ ఫోటో' మూవీతో చాందినీ చౌదరి పేరు మారుమ్రోగిపోయింది. ఆ తర్వాత 'బొంబాట్', సూపర్ ఓవర్', 'సమ్మతమే' సినిమాల్లో నటించింది. అటు తమిళంలో 'సభా నాయగన్' మూవీస్‌లో నటించింది. త్వరలో గామి చిత్రంతో పలకరించబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరగుతోంది. త్వరలో 'యేవమ్' మూవీతో పలకరించబోతుంది. ఈ సినిమాలో కేజీఎఫ్, నారప్ప సినిమాల్లో నించిన వశిష్ఠ, నూతన నటుడు భరత్ రాజ్, బిగ్‌బాస్ ఫేమ్ అషు రెడ్డి ముఖ్యపాత్రల్లో నటించింది. ప్రకాష్ దంతలూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను C- Space నిర్మాణంలో నవదీప్, పవన్ గోపరాజు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు టైటిల్ లోగోను ప్రముఖ పెయింటర్ లక్ష్మణ ఏలే ఆవిష్కరించారు.
సైకాలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో చాందినీ చౌదరి నటనకు మంచి మార్కులే పడతాయని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమాకు నీలేష్ మండాలపు మరియు కీర్తన శేష్, సినిమాటోగ్రఫర్‌గా విశ్వేశ్వర్ SV, ఎడిటర్‌గా సృజన అడుసుమిల్లి, ప్రొడక్షన్ డిజైనర్‌గా లక్ష్మణ్ ఏలే పనిచేశారు.
Also Read: FD Interest Rates: ఎఫ్‌డీలపై అత్యధికంగా 9.50 శాతం వరకూ వడ్డీ ఇచ్చే బ్యాంకులు ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.