Chandrababu Calls Rajinikanth: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎలా అయినా అధికారాన్ని మరోసారి చేజిక్కించుకోవాలని వైసీపీ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటే అధికారాన్ని తాము అందుకోవాలని టీడీపీ కూడా అనేక కార్యక్రమాలు చేస్తోంది. ఇక తాజాగా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ విజయవాడ విచ్చేశారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో సన్నిహితంగా మెలిగిన ఆయన చంద్రబాబు ఇంటికి వెళ్లి ఆతిథ్యం స్వీకరించడమే కాకుండా శతజయంతి ఉత్సవాల వేదికపై కూడా చంద్రబాబు మీద ప్రశంసల వర్షం కురిపించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎన్టీఆర్ తో తన అనుభవాలు పంచుకున్న రజనీకాంత్ ఆ తర్వాత చంద్రబాబులో గొప్ప దార్శనికుడు ఉన్నాడని ఆయనకు ఉన్న విజన్ గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అయితే ఇక్కడ రజనీకాంత్ వైసీపీ నేతలను కానీ ప్రభుత్వాన్ని కానీ ఏమాత్రం విమర్శించలేదు. కానీ తమ శత్రువుని ప్రశంసించిన వాడు కూడా శత్రువే అనుకున్నారో ఏమో తెలియదు గానీ వైసీపీలో కీలక నేతలుగా ఉండే మాజీ మంత్రి కొడాలి నాని, ప్రస్తుత మంత్రులు రోజా, అంబటి రాంబాబు వంటి వారు రజినీకాంత్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు.


 దీంతో తమ నేతలే విమర్శలు చేస్తుంటే తామేం తక్కువ తిన్నాము అనుకున్నారేమో తెలియదు కానీ వైసీపీ సోషల్ మీడియా కూడా రజనీకాంత్ ను టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. అయితే తెలుగు రాష్ట్రాల్లోనే రజినీకాంత్ ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువగా ఉంటుంది అనుకుంటే దానికి మూడింతలు ఫ్యాన్ బేస్ తమిళనాడులో ఉంటుంది.


Also Read: Ravipalli Rambabu: స్కాంకి పాల్పడ్డ టాలీవుడ్ డైరెక్టర్.. డబ్బు కోసం ఇంత నీచమా?


ఇక తాజాగా తమిళ తంబీలు ఈ వ్యవహారం లోకి ఎంట్రీ ఇచ్చి రజనీకాంత్ ని విమర్శించే అంత మొనగాళ్ళు మీరా? అనే విధంగా వైసీపీ సోషల్ మీడియా మీద దాడి మొదలుపెట్టారు. రజినీకాంత్ పొలిటికల్ సూపర్ స్టార్ అయితే జగన్ జైల్ సూపర్ స్టార్ అని అర్థం వచ్చేలా ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ వైసీపీ రజినీకాంత్ కి క్షమాపణలు చెప్పాలనే విధంగా కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ విషయం మీద ముందు సైలెంట్ గానే ఉన్న టిడిపి ఇప్పుడు రజనీకాంత్ కి మద్దతుగా వైసీపీని టార్గెట్ చేస్తోంది.


వైసీపీ సోషల్ మీడియా రజినీకాంత్ ని టార్గెట్ చేసిందన్న విషయం తెలుసుకుని టీడీపీ అధినేత చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా ఖండించారు. అలాగే తన తరఫున రజినీకాంత్ కి ఫోన్ చేసి ఆయన మాట్లాడినట్లు తెలుస్తోంది. రజినీకాంత్ కి చంద్రబాబు ఫోన్ చేసి వైసీపీ నేతలు తీవ్ర విమర్శల పట్ల ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వైసిపి నేతల విమర్శలు పట్టించుకోవద్దని రజనీకాంత్ ను చంద్రబాబు కోరగా ఎవరెన్ని విమర్శలు చేసినా నేను స్పందించబోనని ఎందుకంటే తాను ఉన్న విషయాలు చెప్పానని రజినీకాంత్ చెప్పినట్లు తెలుస్తోంది. నా అభిప్రాయం ఈ విషయంలో మారదని పేర్కొన్న ఆయన కొంత సంయమనం పాటించాలని కూడా అభిమాన సంఘాల వారిని కోరినట్లుగా చంద్రబాబు దృష్టికి తీసుకు వచ్చినట్లుగా తెలుస్తోంది.


ఈ మేరకు మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నా అధికారికంగా మాత్రం అటు చంద్రబాబు నుంచి కానీ ఇటు రజినీకాంత్ నుంచి గాని ఎలాంటి క్లారిటీ అయితే లేదు. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి కానీ రజనీకాంత్ ఆఫీస్ నుంచి కానీ ఈ విషయం మీద ఎలాంటి స్పందన బయటకు వ్యక్తం కాలేదు. మొత్తం మీద రజినీకాంత్ చంద్రబాబును పొగుడుతూ చేసిన వ్యాఖ్యలు వైసిపి నేతలకు నచ్చలేదని అందుకే తెలుగు రాజకీయాలకు సంబంధం లేని రజనీకాంత్ మీద విషం చిమ్ముతున్నారని టిడిపి సోషల్ మీడియా కూడా రజనీకాంత్ ను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. చూడాలి మరి ఈ వ్యవహారం ఎంత దూరం వెళ్లబోతుంది అనేది.
Also Read: Venuswami: అఖిల్ పతనానికి అమలే కారణం.. వేణుస్వామి సంచలన కామెంట్స్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook