Ravipalli Rambabu: స్కాంకి పాల్పడ్డ టాలీవుడ్ డైరెక్టర్.. డబ్బు కోసం ఇంత నీచమా?

Director Ravipalli Rambabu in Fake Certificates Scam: సంవత్సరాల తరబడి కష్టపడి చదువుకున్న విద్యార్థుల జీవితాలు నాశనం చేసే విధంగా నకిలీ సర్టిఫికెట్లను విక్రయిస్తున్న ముఠాలో టాలీవుడ్ డైరెక్టర్ ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. 

Written by - Chaganti Bhargav | Last Updated : May 2, 2023, 04:12 PM IST
Ravipalli Rambabu: స్కాంకి పాల్పడ్డ టాలీవుడ్ డైరెక్టర్.. డబ్బు కోసం ఇంత నీచమా?

Director Ravipali Rambabu Involved in Fake Certificates Scam: సాధారణంగా సినీ రంగం అంటేనే గ్లామర్ ఫీల్డ్ కావడంతో అందరి దృష్టి దాని మీదే ఉంటుంది. సినీ రంగానికి చెందిన వారు ఎలాంటి తప్పు చేసినా వెంటనే అది హైలైట్ అవుతూ ఉంటుంది. తాజాగా నటుడు, దర్శకుడైన ఒక టాలీవుడ్ వ్యక్తి చేసిన పని ఇప్పుడు టాలీవుడ్ పరువు మొత్తాన్ని గంగలో కలిపే విధంగా సాగింది. అసలు విషయం ఏమిటంటే ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం కలకలం రేపుతోంది. సంవత్సరాల తరబడి కష్టపడి చదువుకున్న విద్యార్థుల జీవితాలు నాశనం చేసే విధంగా అంగట్లో సరుకుల్లా ఈ నకిలీ సర్టిఫికెట్లు దొరుకుతున్నాయి.

ఫేక్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు తయారుచేసి వాటి మీద లోన్లు తీసుకుని బ్యాంకులను మోసం చేశారంటూ అర్జున్ సురవరం అనే సినిమాలో ఒక సరికొత్త స్కాం బయటపడిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఒక స్కాం వెనుక టాలీవుడ్ నటుడు దర్శకుడైన రావిపల్లి రాంబాబు హస్తం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అసలు విషయానికి వస్తే ఒకపక్క సినిమాల్లో నటుడిగా రాణిస్తూ అడపాదడపా దర్శకత్వం కూడా చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు రావిపల్లి రామభద్రరావు అలియాస్ రాంబాబు ఆయన వయస్సు 62 సంవత్సరాలు ఆ మధ్యకాలంలో శివాజీ, ప్రీతా విజయకుమార్ ప్రధాన పాత్రలలో నటించిన వైఫ్ సినిమాకి ఆయన దర్శకుడిగా వ్యవహరించారు. కేవలం వైఫ్ అనే సినిమా మాత్రమే కాదు డాక్టర్ పరమానందయ్య స్టూడెంట్స్, అనగనగా ఒక చిత్రం, రుద్ర ఐపిఎస్ వంటి సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు.

Also Read: Akhil Pooja Hegde Date : పూజా హెగ్డేతో డేటింగ్.. ఓపెన్ అయిన అఖిల్

కేవలం దర్శకత్వం వహించడం మాత్రమే కాదు అనేక సినిమాల్లో కమెడియన్ గా కూడా కనిపిస్తూ ఉంటారు.  కొన్ని కన్సల్టెన్సీలతో సంబంధాలు పెట్టుకున్న రాంబాబు చదువు పూర్తి చేయని విద్యార్థులకు నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు పోలీసులు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు చెందిన రేణుకేష్ అనే వ్యక్తికి శ్రీ వెంకటేశ్వర కన్సల్టెన్సీ అనే ఒక కన్సల్టెన్సీ ఉంది .వివిధ రాష్ట్రాలకు చెందిన విశ్వవిద్యాలయాల నకిలీ సర్టిఫికెట్లు విక్రయించే హిమాచల్ ప్రదేశ్ కు చెందిన రాహుల్ దీక్షిత్ తో రేణుకేష్ కి పరిచయం ఏర్పడింది.

ఈ రాహుల్ దీక్షిత్ సినీ దర్శకుడైన రావిపల్లి రాంబాబు అతని బంధువు ఎర్రగడ్డలో అప్గ్రేడ్ స్టడీ కన్సల్టెన్సీ నడుపుతున్న దినేష్ యూసఫ్ గూడకు చెందిన శ్రవణ్ అనే వ్యక్తులతో కూడా పరిచయం చేసుకున్నారు. ఇలా తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులందరూ కలిసి రాహుల్ దీక్షిత్ దగ్గర నకిలీ సర్టిఫికెట్లు కొని ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ తదితర కోర్సులకు సంబంధించిన సర్టిఫికెట్లను లక్ష నుంచి లక్షన్నర వరకు రేటు పెట్టి అమ్ముతున్నారు. ఈ మధ్యకాలంలో కొంపల్లి ప్రాంతానికి చెందిన గొట్టిముక్కల రోహిత్ వర్మకు ఇలాగే ఒక బీటెక్ సర్టిఫికెట్ అమ్మారు. రోహిత్ వర్మ ద్వారా సమాచారం అందుకున్న ఎల్బీనగర్ సరూర్నగర్ పోలీసులు రోహిత్ వర్మ సహా రేణుకేష్, శ్రవణ్ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.

వారి దగ్గర 39 నకిలీ సర్టిఫికెట్లు, 486 హోలో గ్రాములు, ఒక కారు, 8 ఫోన్లు కొన్ని యూనివర్సిటీలకు చెందిన రబ్బర్ స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ ముఠాకి చెందిన సినీ దర్శకుడు రాంబాబు, దినేష్, రాహుల్ వంటి వారు పరారీలో ఉన్నట్టుగా హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు. ఈ ముఠా ఈ రెండేళ్ల వ్యవధిలో సుమారు 80 మంది వరకు చదువుకోని వ్యక్తులకు నకిలీ సర్టిఫికెట్లు విక్రయించినట్లుగా దర్యాప్తులో తేలింది. అయితే హిమాచల్ ప్రదేశ్ లోని యూనివర్సిటీ సర్టిఫికెట్లు ఎలా సంపాదిస్తున్నారనే విషయం మీద ఇప్పుడు పోలీసులు దృష్టి పెట్టారు.

Also Read: Pawan Kalyan OG : సెట్ నుంచి పవన్ కళ్యాణ్‌ ఫోటో.. మాటిస్తున్నామంటూ నిర్మాణ సంస్థ ట్వీట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News