Chandramukhi 2: తమిళ అగ్ర నటుడు రజనీకాంత్ హీరోగా, జ్యోతిక హీరోయిన్‌గా నటించి అబాలగోపాలాన్ని లక లక లక మంటూ భయపెట్టిన చంద్రముఖి సీక్వెల్ మాత్రం అంతగా భయపెట్టలేకపోతోంది. బాక్సాఫీసు వద్ద ఆశించిన విజయాన్ని నమోదు చేయలేక చతికిలపడుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చంద్రముఖి నాడు ఎంతగా భయపెట్టిందో, ఎంతటి సెన్సేషనల్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. 17 ఏళ్ల తరువాత దర్శకుడు పి వాసు తెరకెక్కించిన చంద్రముఖి 2లో ప్రముఖ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్, హీరోగా, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ హీరోయిన్‌గా నటించారు. సెప్టెంబర్ 28న విడుదలైన చంద్రముఖి 2 ఎందుకో అంతగా మెప్పించలేకపోయింది. కొత్తదనం లేదనే విమర్శలకు తోడు లారెన్స్ నటన తేలిపోయిందంటున్నారు. రజనీకాంత్ స్థానంలో లారెన్స్ ఆకట్టుకోలేకపోయాడనే విమర్శలు వస్తున్నాయి. ఫలితంగా బాక్సాఫీసు వద్ద ప్రభావం చూపించలేకపోతోంది. 


ఇప్పుడీ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులు నిర్ధారణయ్యాయి. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ 8 కోట్లకు చంద్రముఖి 2 ఓటీటీ హక్కుల్ని కొనుగోలు చేసింది. ఒప్పందం ప్రకారం విడుదలైన 45 రోజుల తరువాత ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాకు లారెన్స్ భారీగా పారితోషికం తీసుకున్నట్టు సమాచారం. ఏకంగా 25 కోట్లు తీసుకున్నాడని తెలుస్తోంది. ఇంకా సీనియన్ నటీ నటులు చాలామంది చంద్రముఖి 2లో నటించారు. 


Also read: Nidhhi Agerwal: అందాల బాంబ్ పేల్చిన నిధి అగర్వాల్.. హాట్ పోజులతో కిల్లింగ్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook