Shilpa shetty: బాలీవుడ్‌ నటి శిల్పా శెట్టి, ఆమె తల్లి సునంద శెట్టిపై యూపీ పోలీసులు కేసు నమోదు చేశారు. డబ్బులు తీసుకుని మోసానికి పాల్పడ్డారని ఇద్దరు వ్యక్తులు వారిపై ఫిర్యాదు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పోర్నోగ్రఫీ కేసులో నటి శిల్పాశెట్టి(Shilpa shetty) భర్త రాజ్‌ కుంద్రా(Raj Kundra)ను ముంబై పోలీసులు ఇప్పటికే అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పలు కీలక ఆధారాలను సేకరించారు. పలువురు హీరోయిన్లను సైతం విచారించారు. ఈ కేసు దర్యాప్తు అయిన భాగంగా.. బాలీవుడ్ నటి శిల్పాశెట్టి(Shilpa shetty) కి ఊహించని షాక్ తగిలింది. తాజాగా శిల్పాశెట్టి, ఆమె తల్లి సునందపై యూపీ లక్నోలోని రెండు పోలీసు స్టేషన్‌లో చీటింగ్‌ కేసు నమోదైంది.


Also Read: నా అనుమతి లేకుండా అశ్లీల చిత్రాలు, హాట్‌షాట్స్‌ యాప్‌లో విడుదల చేసాడు: నటి


శిల్పా, ఆమె తల్లి తమ వద్ద రూ.కోట్లు తీసుకుని మోసం చేశారంటూ జ్యోత్స్న చౌహాన్, రోహిత్ వీర్ సింగ్ అనే ఇద్దరూ వ్యక్తులు హజరత్‌గంజ్‌, విభూతిఖండ్‌ పోలీసు స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి విచారణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ రెండు బృందాలకు డీసీపీ సంజీవ్‌ సుమన్‌(DCP Sanjeev Suman) అధికారిగా వ్యవహారిస్తున్నారు. కావున ఈ కేసులో ఇప్పటికే శిల్పాను, ఆమె తల్లిని విచారించేందుకు డీసీపీతోపాటు ఒక బృందం ముంబై చేరుకున్నట్లు అధికారులు తెలిపారు.


వివరాల్లోకి వెళితే..
శిల్పాశెట్టి(Shilpa shetty)  'అయోసిస్‌ వెల్‌నెస్‌ అండ్‌ స్పా' (Ayosis Wellness and Spa)పేరుతో ఫిటినెస్‌ సెంటర్‌ను నడిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఫిట్‌నెస్ సెంటర్‌కు శిల్పా చైర్మన్‌గా ఉండగా, ఆమె తల్లి సునంద డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఫిట్‌నెస్‌ సెంటర్‌ మరో బ్రాంచ్‌ను లక్నోలో ప్రారంభించేందుకు జ్యోత్స్న చౌహాన్‌, రోహిత్‌ వీర్‌ సింగ్‌ అనే ఇద్దరికి వారు ఫ్రాంచైజ్‌ ఇచ్చారు. అయితే.. ఈ సెంటర్‌ను ప్రారంభించేందుకు వారి నుంచి కోట్ల రూపాయలు తీసుకున్నట్లు ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. ఆ తర్వాత దీనిపై వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో వారు మోసం​చేశారంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook