నా అనుమతి లేకుండా అశ్లీల చిత్రాలు, హాట్‌షాట్స్‌ యాప్‌లో విడుదల చేసాడు: నటి

ప్రముఖ వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో రోజుకో కొత్త కోణం వెలుగు చూస్తోంది. తాజాగా మరో నటి కుంద్రాపై పోలీసులకు ఫిర్యాదు చేయటం హాట్ టాఫిక్ గా మారింది.

Last Updated : Aug 6, 2021, 07:24 PM IST
  • రాజ్ కుంద్రాపై మరో కేసు పెట్టిన నటి
  • రోజు రోజుకు పెరుగుతన్న భాదితుల సంఖ్య
  • అశ్లీల చిత్రాలు హాట్‌షాట్స్‌ విడుదల చేశారని ఆరోపణలు
నా అనుమతి లేకుండా అశ్లీల చిత్రాలు, హాట్‌షాట్స్‌ యాప్‌లో విడుదల చేసాడు: నటి

Raj Kundra Pornography case: బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా(Raj Kundra ) కేసులో రోజుకో కొత్త కోణం వెలుగు చూస్తోంది. పోర్న్ వీడియోలు షూట్ చేసి యాప్స్‌లో అప్‌లోడ్ చేస్తున్నారనే ఆరోపణలతో ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు ఆయనను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో కీలక ఆధారాలను సేకరించేందుకు శిల్పాశెట్టి(shilp shetty)తో సహా పలువురిని విచారించి...కూపీ లాగే పనిలో ఉన్నారు పోలీసులు. తాజాగా ఓ నటి రాజ్ కుంద్రాపై తీవ్ర ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది.

Also Read:Bigg Boss 5 Telugu:హాట్ టాఫిక్ గా యూట్యాబ్ స్టార్ రెమ్యూనరేషన్ ..ఎంతో తెలుసా?

 తన అనుమతి తీసుకోకుండానే తన అశ్లీల చిత్రాలు హాట్‌షాట్స్‌ యాప్‌లో రాజ్‌కుంద్రా విడుదల చేశారని ఆమె ఆరోపిస్తున్నారు. ఇటీవల మల్వాణీ పోలీస్‌స్టేషన్‌లో రాజ్ కుంద్రాపై ఆమె ఫిర్యాదు చేసింది. సదరు నటి నుంచి తాజాగా ముంబై క్రైం  బ్రాంచ్‌ పోలీసులు స్టేట్‌మెంట్‌ రికార్డ్‌ చేసుకొని...ఆ దిశగా విచారణ చేపడుతున్నట్లు సమాచారం. రాజ్‌ కుంద్రా మంచి వ్యక్తి కాదని, తనకిచ్చిన మాట తప్పాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు.. వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Asloo Read: రాజ్ కుంద్రా అరెస్ట్: Gehana vasisth photos gallery వైరల్

ప్రైవేట్‌ పార్ట్స్‌ని వీడియోలో చూపించకూడదు అనే షరతుతోనే తాను రాజ్‌కుంద్రా నిర్మించిన ఓ అశ్లీల చిత్రంలో నటించానని..అయితే తన అనుమతి తీసుకోకుండా.. ఏ విధమైన మార్పులు చేయకుండా పూర్తి వీడియోని హాట్‌షాట్స్‌లో విడుదల చేశారని ఆ నటి పోలీసులకు తెలిపినట్లు సమాచారం. ఓ స్నేహితుడి ద్వారా ఆ విషయం తనకు తెలిసిందని ఆమె వివరించింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News