Anushka Virat Kohli Daughter కొన్నాళ్ల క్రితం హైదరాబాద్ కి చెందిన ఐఐటి గ్రాడ్యుయేట్ రామ్‌ నగేష్ ఆకుబత్తిని విరాట్ కోహ్లీ, అనుష్క దంపతుల కూతురుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అతనిపై కేసు నమోదు చేయడంతో పాటు పోలీసులు అరెస్టు చేయడం కూడా జరిగింది అంటూ వార్తలు వచ్చాయి. అయితే అతను ఒక ఐఐటి గ్రాడ్యుయేట్ అవ్వడంతో పాటు ఉన్నత చదువుల నిమిత్తం విదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్న కారణంగా అతడిని క్షమించాలని విరుష్క దంపతులను కొందరు విజ్ఞప్తి చేశారట. అతడు కూడా తాను విదేశీ చదువుల నిమిత్తం వెళ్లాలంటూ విజ్ఞప్తి చేయడం, అతని కుటుంబ సభ్యుల విజ్ఞప్తితో కేసుని విత్ డ్రా చేసుకునేందుకు కోహ్లీ దంపతులు ఓకే చెప్పారు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కోహ్లీ దంపతుల నిర్ణయంతో అతడి పై ఉన్న కేసు తొలగి పోవడంతో విదేశాలకు ఉన్నత చదువుల నిమిత్తం వెళ్ళబోతున్నాడట. ఈ సమయంలోనే సింగర్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన చిన్మయి శ్రీపాద సోషల్ మీడియా ద్వారా అతనిపై తీవ్ర స్థాయిలో స్పందించింది. అతడిని అనుష్క కోహ్లీ దంపతులు క్షమించినా కూడా కచ్చితంగా అతనిపై ఒక కన్నేసి ఉంచాలని, చిన్న పిల్లని రేప్ చేస్తానంటూ వ్యాఖ్యలు చేసిన అతడి విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చిన్మయి సోషల్ మీడియా ద్వారా హెచ్చరించింది. ఈ సమయంలోనే విరుష్క ఫ్యాన్స్ కూడా అతడిపై తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు. 


[[{"fid":"270355","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


చిన్న పాపపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అతడిని క్షమించాల్సిన అవసరం ఏంటంటూ వారు ప్రశ్నిస్తున్నారు. అతడిని కఠినంగా శిక్షించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అతడికి క్షమాబిక్ష పెట్టడం పట్ల కొందరు వ్యతిరేకత చూపుతుంటే.. అనుష్క కోహ్లీ దంపతుల మంచితనంకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఆవేశంలో చేసిన వ్యాఖ్యల వల్ల అతడి జీవితం నాశనం కాకూడదు.. అతడి కుటుంబ సభ్యుల జీవితాలు నాశనం కాకూడదు అనే ఉద్దేశ్యంతోనే కోహ్లీ దంపతులు ఈ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు అభినందించాల్సిందే అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 


Also Read:  Malli Pelli Teaser : మళ్లీ పెళ్లి టీజర్.. నరేష్-రమ్య రఘుపతి-పవిత్రల కథే సినిమానా?.. హోటల్ సీన్ కేక


మొత్తానికి ఐఐటి గ్రాడ్యుయేట్ అయిత రామ్‌ నగేష్ ఆకుబత్తిని జీవితాంతం విమర్శలను ఎదుర్కోవాల్సిందే. చిన్నపిల్లల విషయంలో అలాంటి వ్యాఖ్యలు చేసే ఎలాంటి వ్యక్తులనైనా కఠినంగా శిక్షించాల్సిందే. అలాంటి దుర్మార్గులకు ఈ సభ్య సమాజంలో స్థానం లేదు అంటూ కొందరు తీవ్ర స్థాయిలో మండిపడుతూ సోషల్ మీడియా ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. ఈ సమయంలో చిన్మయి కామెంట్స్ కి కొందరు మద్దతు పలుకుతుంటే.. ఈ వివాదాన్ని ముగిస్తే బాగుంటుంది కదా మళ్లీ ఎందుకు మీరు రెచ్చగొడుతున్నారు అంటూ ఆమెను విమర్శించే వారు కూడా ఉన్నారు.


Also Read: Asha Negi Photos : బెడ్డుపై నగ్నంగా బుల్లితెర నటి.. ఆశలు రేపేలా ఆశా నేగి పోజులు.. పిక్స్ వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook