Chiranjeevi - pawan kalyan : చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా కోసం ప్రమోషన్స్ అంటూ ఫుల్ బిజీగా తిరిగేస్తున్నాడు. ముంబై, హైద్రాబాద్‌లలో ఈవెంట్లు అంటూ తిరిగేస్తున్నాడు. అయితే రేపు (అక్టోబర్ 5) ఈ చిత్రం విడుదల కాబోతోన్న సందర్భంగా.. నేడు మీడియాతో ముచ్చటించాడు. ఈ క్రమంలో రాజకీయాలకు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. పవన్ కళ్యాణ్, జన సేన గురించి స్పందించాల్సిన సమయం వచ్చింది. గతంలో ఓ సారి చిరు మాట్లాడుతూ.. ఇంట్లోనే ఓ పార్టీ ఉండగా.. వేరే పార్టీలకు ఎందుకు మద్దతిస్తాను.. నా తమ్ముడికే మద్దతిస్తాను అని చిరంజీవి అన్నాడట. ఈ విషయాన్ని ఓ రిపోర్టర్ ప్రెస్ మీట్‌లో ప్రస్థావించాడు. మీరు నాతో ఫోన్ ఇంటర్వ్యూలో అలా అన్నారు.. ఇప్పుడు కూడా అదే మాట మీదున్నారా? అని చిరంజీవిని ప్రశ్నించాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాను అంత స్పష్టంగా.. పవన్ కళ్యాణ్‌కు మద్దతు ఇస్తున్నాను అని చెప్పి ఉండను.. వేరే పార్టీలకు మద్దతు ఇవ్వను అని ఉండను..  అని క్లారిటీ ఇచ్చాడు. అయితే తన తమ్ముడి నిబద్దత గురించి తనకు తెలుసు అని, తన లాంటి నాయకులు రావాలని కోరుకున్నాడు. తాను ఒక పక్క.. తన తమ్ముడు ఒక పక్క ఉండటం ఎందుకు.. తాను పక్కకి తప్పుకుంటే.. తన తమ్ముడు ఎమర్జ్ అవుతాడనిపిస్తుందంటూ చిరంజీవి అన్నాడు.


ఎంతైనా పవన్ కళ్యాణ్‌ తన తమ్ముడని.. భవిష్యత్తులో ఏమైనా జరగొచ్చని.. మద్దతు ఇవ్వొచ్చేమో అని ఇలా ఎటూ తేల్చకుండా.. కర్ర విరగకుండా. పాము చావకుండా అన్నట్టుగా స్పందించాడు. దీంతో చిరంజీవి మనసులో ఉన్నది ఏంటన్నది ఎవ్వరికీ అంతు పట్టడం లేదు. ఇప్పుడు జగన్‌తో వైరం ఎందుకు అని ఇలా సైడ్ అయిపోతోన్నాడా? తన తమ్ముడికి నేరుగా మద్దతు ఇవ్వలేకపోతోన్నాడా? అనేది అర్థం కావడం లేదు. అయితే సొంత తమ్ముడికి కూడా సపోర్ట్ ఇస్తున్నాను అని ధైర్యంగా చెప్పలేని స్థితిలో చిరంజీవి ఉన్నాడా? అంటూ పవర్ స్టార్ అభిమానులు అంటున్నారు.


మొత్తానికి గాడ్ ఫాదర్ సినిమా మీద మాత్రం ఇప్పటికే దారుణమైన నెగిటివ్ టాక్ ఏర్పడింది. మలయాళంలో ఈ సినిమాను రిలీజ్ చేయబోతోన్నారంటూ వచ్చిన వార్తల మీద స్పందించారు. కేరళలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడం లేదని చిరు చెప్పాడు. మరి రేపు గాడ్ ఫాదర్ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఓకే గానీ లేదంటే.. ఆచార్య రేంజుల్ ట్రోల్స్ తప్పవనిపిస్తోంది.


Also Read : లిప్ కిస్ దెబ్బకు పీడకలలు.. రాత్రంతా ఏడుస్తూనే ఉండేదాన్ని..బాధ బయటపెట్టిన రష్మిక


Also Read : Unstoppable season 2 : బాబుతో బాలయ్య రొమాంటిక్ టాక్.. అదిరిపోయే లీక్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook