Rashmika Bad Experince: లిప్ కిస్ దెబ్బకు పీడకలలు.. రాత్రంతా ఏడుస్తూనే ఉండేదాన్ని..బాధ బయటపెట్టిన రష్మిక

Rashmika Reveals her Bad Experince after lip lock with Vijay Devarakonda for Dear Comrade: డియర్ కామ్రేడ్ సినిమాలో లిప్ కిస్ సీన్ ట్రోల్ అయినప్పుడు తాను చాలా నరకం అనుభవించానని రష్మిక బయటపెట్టింది. రోజూ పీడకలలు వస్తే లేచి ఏడుస్తూనే ఉండేదాన్నని ఆమె పేర్కొంది. 

Written by - Chaganti Bhargav | Last Updated : Oct 4, 2022, 01:29 PM IST
  • : లిప్ కిస్ దెబ్బకు పీడకలలు..
  • రాత్రంతా ఏడుస్తూనే ఉండేదాన్ని..
  • బాధ బయటపెట్టిన రష్మిక
Rashmika Bad Experince: లిప్ కిస్ దెబ్బకు పీడకలలు.. రాత్రంతా ఏడుస్తూనే ఉండేదాన్ని..బాధ బయటపెట్టిన రష్మిక

Rashmika Reveals her Bad Experince after lip lock with Vijay Devarakonda for Dear Comrade: ఛలో సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం మన రష్మిక మందన ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా మారిపోయింది, నేషనల్ క్రష్ గా మారడమే కాక బాలీవుడ్ లో కూడా ప్రాజెక్టులు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. నిజానికి పుష్ప సినిమాలో ఆమె చేసిన శ్రీవల్లి పాత్రతో ఒక్కసారిగా నేషనల్ వైడ్ మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది.

ప్రస్తుతం బాలీవుడ్లో చేతినిండా ఆఫర్లతో ఆమె బిజీ బిజీగా గడుపుతోంది. తాజాగా ఆమె గుడ్ బై అనే సినిమాలో కీలక పాత్రలో నటించింది. ఈ సినిమా త్వరలో రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. ఒక నేషనల్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆమె విజయ్ దేవరకొండతో కలిసి గీతగోవిందం, డియర్ కామ్రేడ్ వంటి సినిమాల్లో నటించింది.  గీత గోవిందం సినిమాలో విజయ్ దేవరకొండతో ఆమెకు లిప్ లాక్ ఉంటుంది.

అది పెద్ద విషయం కాదు కానీ డియర్ కామ్రేడ్ సినిమా హిందీలో కూడా విడుదలైన నేపద్యంలో బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సినిమా దగ్గర అయింది. ఈ క్రమంలోనే సదరు బాలీవుడ్ యాంకర్ ఈ సినిమాలో లిప్ లాక్ సీన్ గురించి ఒక ప్రశ్న సంధించారు. అయితే ఈ లిప్ లాక్ సీన్ గురించి మాట్లాడుతూ రష్మిక పలు ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఈ సీన్ చేసిన తర్వాత తన మీద బీభత్సమైన ట్రోల్స్ వచ్చాయని పేర్కొంది.

పబ్లిసిటీ కోసమే ఈ లిప్ లాక్ చేశామని విమర్శలు కూడా రావడంతో చాలా బాధపడ్డానని ఆమె చెప్పుకొచ్చారు. అంతేకాదు ఈ ట్రోలింగ్ వలన చాలా రోజుల పాటు రోజు పీడకలలు వచ్చేవని, ఆ కల నిజమో కాదో కూడా అర్థమయ్యేది కాదని చెప్పుకొచ్చారు. అంతేకాక నిద్ర లేచి బెడ్ మీద కూర్చుని రోజు ఏడ్చేదాన్ని ఆమె చెప్పుకొచ్చారు. పక్కన ఎవరూ ఉండకపోవడంతో రాత్రంతా ఏడుస్తూనే ఉండేదాన్ని రష్మిక చేసిన కామెంట్లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

అయితే రష్మిక మందన్న విజయ్ దేవరకొండ మధ్య ప్రేమ బంధం ఉందని రకరకాల ప్రచారాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఎప్పటికప్పుడు ఈ జంట వాటిని ఖండిస్తూనే ఉంటుంది. అయినా సరే మళ్లీ మళ్లీ ఆ ప్రచారాలు జరుగుతూనే ఉంటాయి. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు వేరే వారిని వివాహం చేసుకుంటే తప్ప ఈ పుకార్లకు బ్రేకులు పడే అవకాశాలు అయితే కనిపించడం లేదు.

Also Read: Viran in Allu Arjun's Zomato Ad: సొంత కుంపటిని బలపరుచుకుంటున్న అల్లు అర్జున్.. ఇక తగ్గేదేలే!

Also Read: Adipurush New Controversy: హనుమంతుడికి తోలు గుడ్డలా.. మార్చకపోతే లీగల్ యాక్షన్.. హోమ్ మినిష్టర్ స్ట్రాంగ్ వార్నింగ్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News