Acharya Movie Tickets: ఇదేందయ్యో ఇది.. అక్కడ ఆచార్య సినిమాకు ఒకటే టికెట్ బుక్ అయిందట!
Chiranjeevi and Balakrishna fans fighting over Acharya Movie Tickets. కొన్ని చోట్ల మాత్రం ఇప్పటివరకు కూడా ఆచార్య సినిమా టికెట్స్ అమ్ముడుపోలేదని నెట్టింట కొన్ని స్క్రీన్ షాట్స్ హల్చల్ చేస్తున్నాయి.
Chiranjeevi and Balakrishna fans fighting on twitter about Acharya Movie Tickets: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా 'ఆచార్య'. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం (ఏప్రిల్ 29న) విడుదల కానుంది. సురేఖ కొణిదెల సమర్పణలో నిరంజన్ రెడ్డి ఆచార్య సినిమాను నిర్మించారు. ఇదివరకు కొన్ని సినిమాల్లో చిరు, చరణ్ అతిథి పాత్రల్లో కనిపించగా.. ఫుల్ లెన్త్ సినిమాలో మాత్రం ఎప్పుడూ కనిపించలేదు. ఆచార్య సినిమాతో మెగా అభిమానుల కల నెరవేరింది. తండ్రీకొడుకుల సినిమా కోసం మెగా ఫాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఆచార్య సినిమా బుకింగ్స్ ఇప్పటికే ఓపెన్ అయ్యాయి. బుక్ మై షో, టికెట్ దాదా, పేటీఎం లాంటి ఆప్‌లలో టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. విడుదల చేసిన కొన్ని గంటల్లోనే ఆచార్య టికెట్స్ ఖతం అయిపోయాయి. అయితే కొన్ని చోట్ల మాత్రం ఇప్పటివరకు కూడా టికెట్స్ అమ్ముడుపోలేదని నెట్టింట కొన్ని స్క్రీన్ షాట్స్ హల్చల్ చేస్తున్నాయి. ఏపీ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో ఉన్న రెయిన్ సినిమా థియేటర్‌లో శుక్రవారంకు సంబందించిన టికెట్స్ ఇంకా ఉన్నాయని చిన్నయ్య తారక్ అనే యూసర్ ట్విట్టర్‌లో ఓ స్క్రీన్ షాట్ పెట్టాడు.
'అగ్ర హీరోల సినిమాలకు మా నెల్లూరులో మొదటి వారం రోజుల పాటు టికెట్స్ దొరకడమే కష్టం. అయితే ఆచార్య సినిమా టికెట్స్ ఇంకా ఉన్నాయి. అడ్డా అని రుద్దినంత సులువు కాదు టిక్కెట్లు తెగడం' అని చిన్నయ్య తారక్ పేర్కొన్నాడు. ఇక హైదరాబాద్‌లోని బహదురుపుర మెట్రో సినిమా థియేటర్‌లో శుక్రవారం ఉదయం 8 గంటల షోకి.. ఒక్కటే బుక్ అయిందని నాయుడు త్రివిక్రమ్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నాడు. అందుకు సంబందించిన స్క్రీన్ షాట్ కూడా తన ట్వీటుకు జతచేశాడు.
అయితే ఈ పోస్టులు చేసిన వారు నందమూరి ఫాన్స్ అని పలువురు నెటిజన్లు అంటున్నారు. కావాలనే ఇలా నెగటివ్ టాక్ తీసుకొస్తున్నారని సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. మెగా, నందమూరి ఫాన్స్ నెట్టింట మాటల యుద్దానికి తెరలేపారు. ఇది ఇంకా కొనసాగుతోంది. అయితే ఇద్దరి స్టార్ హీరోల అభిమానులు ఇలా చేయడం సర్వసాధారణం అయింది.
Also Read: TS govt Jobs 2022: తెలంగాణాలో కొలువుల జాతర.. ఎక్సైజ్, రవాణా శాఖలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్!
Also Read: Allu Arjun Remuneration: తగ్గేదేలే.. పుష్ప 2 కోసం అల్లు అర్జున్ షాకింగ్ రెమ్యునరేషన్! ఏకంగా డబుల్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.