Allu Arjun Remuneration: తగ్గేదేలే.. పుష్ప 2 కోసం అల్లు అర్జున్ షాకింగ్ రెమ్యునరేషన్! ఏకంగా డబుల్..

Allu Arjun Remuneration for Pushpa 2 Movie. పుష్ప పార్ట్‌ 1 కంటే పార్ట్‌ 2కు ఎక్కువ కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. అయితే పుష్ప 2 కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ భారీ స్థాయిలో పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 28, 2022, 05:49 PM IST
  • అల్లు అర్జున్ షాకింగ్ రెమ్యునరేషన్
  • డబుల్ చేసిన స్టైలిష్ స్టార్
  • తగ్గేదేలే.. అంటున్న ఐకాన్ స్టార్
Allu Arjun Remuneration: తగ్గేదేలే.. పుష్ప 2 కోసం అల్లు అర్జున్ షాకింగ్ రెమ్యునరేషన్! ఏకంగా డబుల్..

Allu Arjun taking Rs 100 crores Remuneration for Pushpa 2 Movie: మెగా హీరో అనే ట్యాగ్‌తో 'స్టైలిష్ స్టార్' అల్లు అర్జున్ సినిమాల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ ప్రభావం కాస్తయినా కనపడలేదు. తన నటన, డ్యాన్స్‌తో ప్రేక్షుకులను అలరించాడు. ఒక్కోమెట్టు ఎక్కుతూ స్టార్ హీరోగా ఎదిగాడు. ప్రతి సినిమాలోనూ తనలోని కొత్త వేరియేషన్స్ చూపిస్తూ.. ఐకాన్ స్టార్ అయ్యాడు. ప్రస్తుతం అల్లు అర్జున్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్‌లో ఉంది. సౌత్ ఇండియాలోనే కాదు నార్త్ లో కూడా బన్నీకి మంచి మార్కెట్ ఉంది.

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా సినిమా 'పుష్ప: ది రైజ్'తో అల్లు అర్జున్ మార్కెట్ మరింత పెరిగింది. గతేడాది డిసెంబర్ 17న విడుదలైన పుష్ప సినిమా.. కరోనా వైరస్ మహమ్మారి సమయంలోనూ తెలుగు ఇండస్ట్రీలో ఆల్ టైమ్ రికార్డ్స్ నెలకొల్పింది. హిందీలో కూడా పలు రికార్డులను బద్దలు కొట్టింది. సుకుమార్ టేకింగ్ సినిమాకు ఓ ప్లస్ అయితే.. అల్లు అర్జున్‌ తన ఊరమాస్ లుక్, నటనతో పుష్పను మరో రేంజ్‌కు తీసుకెళ్లాడు.

పుష్ప 1 బంపర్ హిట్ కొట్టడడంతో పుష్ప 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పార్ట్‌ 1 కంటే పార్ట్‌ 2కు ఎక్కువ కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. అయితే పుష్ప 2 కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ భారీ స్థాయిలో పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మొదటి భాగానికి రూ. 50 కోట్లు తీసుకున్న బన్నీ.. రెండో భాగానికి రూ. 100 కోట్లు తీసుకుంటున్నారని సోషల్‌ మీడియాలో ఓ వార్త వైరల్‌ అయింది. మరి ఇందులో నిజమెంత ఉందో తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన రష్మిక మందన్న కూడా తన రెమ్యునరేషన్‌ను డబుల్ చేసిందట. 

గంగోత్రి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్‌.. ఆర్య సినిమాతో సూపర్ హిట్ అందుకుని యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించాడు. బన్నీ, దేశముదురు, పరుగు, వరుడు, ఆర్య 2, వేదం, బద్రీనాథ్ చిత్రాలతో స్టార్ అయ్యాడు. జులాయి, ఇద్దరమ్మాయిలతో, రేసుగుర్రం, సన్ ఆఫ్ సత్యమూర్తి, దువ్వాడ జగన్నాథం, నా పేరు సూర్య, అలా వైకుంఠపురంలో సినిమాలతో బన్నీ ఇండస్ట్రీలోకి తనకంటూ ఓ ఐడెంటీటి సంపాదించాడు. ఇక 'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. 

Also Read: Nikhil Siddharth: హీరో నిఖిల్‌ ఇంట పెను విషాదం!

Also Read: Muttiah Muralitharan Angry: మార్కో జాన్సెన్‌ చెత్త బౌలింగ్‌.. బూతులు తిట్టిన సన్‌రైజర్స్‌ కోచ్‌ (వీడియో)

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News