Vijaykanth: విజయ్ కాంత్ సినిమా రీమేక్ లతో హిట్లు కొట్టిన చిరంజీవి, వెంకటేష్.. ఆ మూవీస్ ఇవే..!
Vijayakanth Death: తమిళ సీనియర్ హీరో,డి.ఎం.డి.కె పార్టీ అధినేత విజయ్ కాంత్ ఈరోజు మరణించిన సంగతి తెలిసిందే. కాగా ఈరోజు ఉదయం నుంచి ఆయన గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
Vijayakanth Movies: తమిళ సీనియర్ హీరో,డి.ఎం.డి.కె పార్టీ అధినేత విజయ్ కాంత్ ఈరోజు మరణించిన సంగతి తెలిసిందే.
కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వస్తున్న ఆయన.. ఇటీవల కరోనా బారిన పడటంతో శ్వాస సంబంధిత సమస్య తలెత్తడం వల్ల ఈరోజు తెల్లవారుజామున మరణించారు. దీంతో కోలీవుడ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన అభిమానులు ఈ హీరో గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
అందులో భాగంగా విజయ్ కాంత్ సినిమాలు మన తెలుగు హీరోలు చేసి సూపర్ హిట్ లు అందుకున్న న్యూస్ ఒకటి తెగ వైరల్ అవుతుంది. విజయ్ కాంత్ చేసిన సినిమాలను మన తెలుగు హీరోలు రీమేక్ చేసి సూపర్ హిట్లు అందుకున్నారు. ముఖ్యంగా చిరంజీవి.. వెంకటేష్ లాంటి హీరోలకి విజయ్ కాంత్ సినిమాల రీమేక్ ద్వారా వాళ్ళ కెరియర్ లో మర్చిపోలేని సినిమాలు వచ్చాయి.
వాటిలో ముఖ్యంగా చెప్పుకునేది ఠాగూర్. ఠాగూర్ సినిమా చిరంజీవి కెరియర్ లో ఎంత పెద్ద బ్లాక్ బస్తారో మనందరికీ తెలిసిందే. అప్పట్లో ఈ చిత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా సెన్సేషనల్ మూవీగా నిలిచింది. అయితే ఈ చిత్రం విజయ్ కాంత్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన రమణ సినిమాకు రీమేక్. ఇదే సినిమాని తెలుగులో వి వి వినాయక దర్శకత్వం వహించగా చిరంజీవి హీరోగా నటించారు. అప్పుడు తెలుగు నెటివిటీకి తగినట్లుగా కొన్ని మార్పులు చేసి సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా తమిళంలో బ్లాక్ బస్టర్ సాధించగా తెలుగులో కూడా సెన్సేషనల్ హిట్ గానే నిలిచింది.
విజయ్ కాంత్ తమిళ సూపర్ హిట్ మూవీ 'సత్తం ఓరు ఇరుత్తరై'ని తెలుగులో చట్టానికి కళ్లు లేవు టైటిల్‌తో రీమేక్ అయింది. ఈ రెండు సినిమాలు 1981లో రిలీజ్ అయ్యాయి. ఈ రెండు చిత్రాలకు ఇళయదళపతి విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ డైరెక్టర్. తెలుగులో చిరంజీవి హీరోగా వచ్చిన ఈ సినిమా కూడా హిట్ సాధించింది.
అంతేకాకుండా విజయ్ కాంత్ తమిళ సూపర్ హిట్ మూవీ 'సత్తం ఓరు ఇరుత్తరై'ని తెలుగులో చట్టానికి కళ్లు లేవు టైటిల్‌తో రీమేక్ అయింది. 1981లో విడుదలైన ఈ రెండు సినిమాలకు ఇళయదళపతి విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు. తెలుగులో చిరంజీవి హీరోగా వచ్చిన ఈ సినిమా కూడా హిట్ సాధించింది. ఇక చిరంజీవి కెరీర్లో హిట్లగా నిలిచిన దేవాంతకుడు, 1984 లో విజయ్ కాంత్ హీరోగా చేసిన వెట్రి సినిమాకు రీమేక్. అలానే ఖైదీ నెంబర్ 786 .. విజయ్ కాంత్ చిత్రం అమ్మన్ కోయిల్ కళిక్కలే కి రీమేక్.
మరోపక్క వెంకటేష్ కెరియర్ లో సూపర్ హిట్గా నిలిచిన చిన రాయుడు సినిమా విజయ్ కాంత్ హీరోగా చేసిన చిన్న గుండర్ సినిమాకు రీమేక్.
మొత్తం పైన ఇలా మన స్టార్ హీరోలైన చిరంజీవి వెంకటేష్ కి తన రీమేక్ సినిమాల ద్వారా సూపర్ హిట్ లో అందించారు విజయ్ కాంత్.
Also read: Corona New Variant Jn.1: దేశంలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు, 17 రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదు
Also read: India Covid Cases Today: ఒక్క రోజులో భారీగా పెరిగిన కరోనా కేసులు.. మొత్తం ఎన్ని కేసులంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook