Chiranjeevi awarded Indian Personality of the Year 2022 at IFFI: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది. ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డు ఆయనను వరించింది. ఈ మేరకు కేంద్ర ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ప్రస్తుతానికి గోవాలో 53వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అనురాగ్ సింగ్ ఠాకూర్ ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డును మెగాస్టార్ చిరంజీవి గెలుపొందినట్లు ప్రకటించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సుమారు నాలుగు దశాబ్దాల పాటు 150 సినిమాలలో నటుడిగా, అద్భుతమైన డాన్సర్ గా, నిర్మాతగా ఆయన రాణించారని అనురాగ్ సింగ్ ఠాకూర్ పేర్కొన్నారు. ఆయన తెలుగు సినిమా ద్వారా ప్రపంచానికి పరిచయమయ్యారని ఆయన తన పర్ఫామెన్స్ తో వేల గుండెలను తాకారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ ట్విట్టర్ అకౌంట్ ని ట్యాగ్ చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక గత ఏడాది ఈ అవార్డును సీనియర్ నటీమణి హేమమాలిని అందుకున్నారు.


ఇప్పుడు ఈ ఏడాదికి గాను మెగాస్టార్ చిరంజీవి ఈ అవార్డును అందుకోవడం గమనార్హం. చివరిగా గాడ్ ఫాదర్ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి త్వరలోనే వాల్తేరు వీరయ్య అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. సంక్రాంతి సందర్భంగా 2023 జనవరి నెలలో ఈ సినిమా విడుదల కాబోతోంది బాబీ డైరెక్షన్ లో శృతిహాసన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది.


మెగాస్టార్ ప్రస్తుతం చేస్తున్న మిగతా సినిమాలన్నీ రీమేక్ సినిమాలు కావడం, ఈ సినిమా స్ట్రైట్ సినిమా కావడంతో ఈ సినిమా మీద మెగా అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు. దానికి తగినట్లుగా ఈ సినిమాల్లో మాస్ మహారాజ రవితేజ కూడా నటిస్తూ ఉండడంతో సినిమా మీద అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇక మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కిన విషయంలో మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువ కురిపిస్తున్నారు.
Also Read: Naresh - Pavitra: మాది అపవిత్ర ప్రేమ కాదు.. నరేష్-పవిత్రల 'ప్రేమ కథా చిత్రమ్'


Also Read: Andrila Sharma: ఇండస్ట్రీలో మరో విషాదం.. 24 ఏళ్ల నటి దుర్మరణం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook