Megastar Chiranjeevi : ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో నంబర్ వన్ స్థానంలో ఉన్న మెగాస్టార్ చిరంజీవి కొన్నాళ్లపాటు సినిమాల నుంచి బ్రేక్ తీసుకొని మళ్ళీ తొమ్మిదేళ్ల తర్వాత రీ-ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ రీ ఎంట్రీ తర్వాత చిరంజీవి కెరీర్ లో పెద్ద చెప్పుకోదగ్గ హిట్లేమీ రాలేదు. వాల్తేరు వీరయ్య సినిమా హిట్ అయినప్పటికీ అందులో చిరంజీవి సోలో హీరో కాదు. మాస్ మహారాజా రవితేజ కూడా సినిమాలో రెండవ హీరోగా నటించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక చిరంజీవి ఇప్పుడైనా సోలో హిట్ కొడితే బాగుంటుంది అని అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ అది మాత్రం ఇప్పట్లో జరిగే పని లాగా కనిపించడం లేదు. ప్రస్తుతం చిరంజీవి బింబీసార తో హిట్ అందుకున్న డైరెక్టర్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమాతో బిజీగా ఉన్నారు.


ఒకవేళ ఈ సినిమా హిట్ అయినా అది చిరంజీవి సోలో హిట్ అని చెప్పుకోలేం. ఎందుకంటే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చాలామంది స్టార్ లు నటించబోతున్నారు. స్టార్ బ్యూటీ త్రిష కృష్ణన్ ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈమెతో పాటు ఆశికా రంగనాథ్, సురభి, ఇషా చావ్లా కూడా సినిమాలో కీలక పాత్రలలో కనిపించబోతున్నారట.


హీరోయిన్ల సంగతి పక్కన పెడితే రాజ్ తరుణ్, నవీన్ చంద్ర వంటి యువ హీరోలతో పాటు వెన్నెల కిషోర్, ప్రవీణ్, వంటి పేరు ఉన్న కమెడియన్లు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. కృణాల్ కపూర్ ఈ సినిమాలో మెయిన్ విలన్ గా నటిస్తున్నారు. ప్రముఖ సీనియర్ నటుడు రావు రమేష్ కూడా ఈ సినిమాలో ముఖ్యపాత్ర పోషించనున్నారు. ఇక ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ తో పాటు మీనాక్షి చౌదరి కూడా కనిపించబోతున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. 


 దాదాపు నటీనటులు అందరూ తెలిసిన వారే కావడంతో సినిమా హిట్ అయినా అది చిరంజీవి సోలో హిట్ అని చెప్పలేం. ఈ నేపథ్యంలో చిరంజీవి కావాలనే తన సినిమాలు హిట్ అవ్వడం కోసం ప్రముఖ నటీనటులను తీసుకుంటున్నారా అని చర్చలు కూడా మొదలయ్యాయి. ఏదేమైనా చిరంజీవి సోలో హిట్ కొట్టాలనే అభిమానుల కోరిక అలాగే మిగిలిపోతుందా అని కొందరు దిగులు పడుతున్నారు.


Also Read: Kavitha Raids: ఎమ్మెల్సీ కవితకు బిగుస్తున్న ఉచ్చు.. ఇంటిపై ఈడీ, ఐటీ దాడులు


Also Read: Kavitha Arrest Updates: ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌.. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter