Chiranjeevi Movie with Puri Jagannadh: ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న పూరీ జగన్నాథ్ ఆ తర్వాత విజయ్ దేవరకొండ దర్శకత్వంలో చేసిన లైగర్ సినిమాతో మాత్రం భారీ డిజాస్టర్ అందుకున్నాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమా హిట్ కావడంతో పాటు విజయ్ దేవరకొండ క్రేజ్ తో ఈ సినిమా భారీ హిట్ అవుతుందని అందరూ ఊహించారు. కానీ భారీ డిజాస్టర్ గా నిలవడంతో పూరి జగన్నాథ్ డబ్బుతో పాటు సహ నిర్మాతగా ఉన్న కరణ్ జోహార్ డబ్బు కూడా చాలా ఈ ప్రాజెక్టులో కోల్పోవాల్సి వచ్చింది. ఈ ప్రాజెక్టు తర్వాత పూరీ జగన్నాథ్ తో మరే హీరో సినిమా చేయడానికి ఆసక్తి చూపించడం లేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాస్తవానికి విజయ్ దేవరకొండ జనగణమన అనే సినిమా కూడా పూరి జగన్నాథ్ తో చేయాల్సి ఉంది కానీ లైగర్ దెబ్బకు ఆయన ప్రాజెక్టు పక్కన పెట్టేశాడు. సినిమా నిర్మాతలైన వంశీ పైడిపల్లి, జూపల్లి గ్రూప్ కూడా సినిమా పక్కన పెట్టాలని నిర్ణయం తీసుకుంది. తర్వాత ఎవరితో సినిమా చేస్తాడు అనే విషయం మీద ఇప్పటివరకు క్లారిటీ లేదు. ఆయన తనకున్న పరిచయాలని వాడి స్టార్ హీరోతో సినిమా సెట్ చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఆ ప్రచారమే నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.


అసలు విషయం ఏమిటంటే మెగాస్టార్ చిరంజీవితో పూరి జగన్నాథ్ సినిమా ఖరారు అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి షాడో లాంటి భారీ డిజాస్టర్ తర్వాత సుమారు 7, 8 ఏళ్లపాటు సినిమాలకు దూరమై ఉంటున్న మెహర్ రమేష్ కి భోళాశంకర్ సినిమా అవకాశం ఇచ్చి అందరినీ ఒక్కసారిగా షాక్ కి గురి చేశారు. ఇప్పుడు అదే బాటలో లైగర్ సినిమా తర్వాత డిజాస్టర్ తో బాధపడుతున్న పూరి జగన్నాథ్ కి కూడా మెగాస్టార్ చిరంజీవి అవకాశం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.


అయితే ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయనే విషయం మీద క్లారిటీ లేదు కానీ టాలీవుడ్ వర్గాలలో మాత్రం పూరి జగన్నాథ్ చిరంజీవి సినిమా దాదాపు ఖరారు అయిందని ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేసే అవకాశం ఉందని అంటున్నారు. వాస్తవానికి మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం భోళాశంకర్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తయిన తర్వాత వెంకీ కుడుముల దర్శకత్వంలో ఆయన ఒక సినిమా చేయాల్సి ఉంది. ఆ సినిమా ఆగిపోయింది అనే ప్రచారం జరుగుతుంది కానీ ఆ విషయం మీద అధికారిక సమాచారం అయితే అందాల్సి ఉంది.
Also Read: Taraka Ratna Health Update: తారకరత్న హెల్త్ అప్డేట్ ఇచ్చిన కళ్యాణ్ రామ్.. ఇప్పుడెలా ఉందంటే?


Also Read: Ram Charan New Party: జనసేనకు షాక్.. కొత్త పార్టీ నుంచి పోటీ చేస్తున్న రామ్ చరణ్?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook