అభిమానులకు ఎప్పుడు ఏ కష్టమొచ్చినా తానున్నానని ముందుండే మెగాస్టార్ చిరంజీవి తాజాగా మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. ఇటీవ‌ల చిరంజీవి అభిమాన సంఘం అధ్య‌క్షుడు అనారోగ్యంతో మృతిచెందగా.. చిరంజీవి స్వయంగా తానే తన అభిమాని ఇంటికి వెళ్ళి వారి కుటుంబసభ్యులను ప‌రామ‌ర్శించారు. పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుటుంబానికి కొంత ఆర్ధిక సహాయం కూడా చేశారని తెలిసిందే. ఆ ఘటన ఇంకా మరువక ముందే తాజాగా గుంటూరులో చిరంజీవి మహిళా అభిమాన సంఘం అధ్య‌క్షురాలు నాగలక్ష్మి గుండె సంబంధిత జబ్బుతో బాధపడుతోందని తెలుసుకున్న అన్నయ్య చిరంజీవి.. ఆమె వైద్యానికి అసరమైన డబ్బులు తానే ఏర్పాటు చేస్తానని.. ఆపరేషన్ కోసం ఏర్పాటు చేసుకోవాల్సిందిగా హామీ ఇచ్చార‌ట‌. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read : COVID-19 in AP: కరోనా బాధితుల్లో మర్కజ్‌కి వెళ్లొచ్చిన వారే అధికం


చిరంజీవి అందించిన ఆర్థిక సహాయంతో హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని స్టార్ హాస్పిట‌ల్‌లో బుధవారం ఆమెకు సర్జరీ జ‌ర‌గ‌నుంద‌ని తెలుస్తోంది. అయితే, ప్రస్తుతం లాక్‌డౌన్ అమలులో ఉన్నందున చిరంజీవి ఆమెని ప‌రామ‌ర్శించ‌డానికి వెళ్ల‌క‌పోవొచ్చ‌ననే తెలుస్తోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..