Divi in God Father: మాట నిలబెట్టుకున్న మెగాస్టార్ చిరంజీవి.. సినిమా మలుపు తిప్పే పాత్రలో దివి!
Chiranjeevi Keeps his promise and offered a role to Divi in God Father: బిగ్ బాస్ స్టేజ్ మీద ఇచ్చిన మాటను చిరంజీవి నిలబెట్టుకున్నారు. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ దివికి గాడ్ ఫాదర్ లో మంచి రోల్ ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే
Chiranjeevi Keeps his promise and offered a role to Divi in God Father: మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఆసక్తికరంగా అనిపిస్తున్నా ఈ మాట నిజమే. అసలు విషయం ఏమిటంటే మెగాస్టార్ చిరంజీవి బిగ్ బాస్ సీజన్ 4 ఫినాలేకి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా బిగ్ బాస్ సీజన్ ఫోర్లో పాల్గొన్న దివి అనే అమ్మాయిని చూసి మెస్మరైజ్ అయ్యారు. ఆమె అందానికి ఫిదా అయిన మెగాస్టార్ చిరంజీవి తన సినిమాలలో అవకాశం కలిపిస్తానని అక్కడికక్కడే మాట ఇచ్చారు.
వీలైతే భోళా శంకర్ సినిమాలో ఆమెకు పోలీసు అధికారి పాత్ర ఇస్తామని అప్పట్లోనే పేర్కొన్నారు. అయితే భోళా శంకర్ సినిమా ఇప్పట్లో విడుదలయ్యే అవకాశాలు లేవు కానీ ఆమె గాడ్ ఫాదర్ సినిమాలో కీలకమైన పాత్రలో కనిపించి ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చింది. ఆమె ఈ సినిమాలో ఒక పాత్రలో నటించిందని సినిమా విడుదలకు ముందే కొన్ని ప్రెస్ మీట్ ల ద్వారా క్లారిటీ వచ్చింది. కానీ ఆమె ఏ పాత్రలో నటించింది అనే విషయం మీద కాస్త సందిగ్ధత ఉండగా సినిమా విడుదలైన తర్వాత సినిమా మొత్తాన్ని కీలక మలుపు తిప్పే పాత్రలో నటించిన తెలిసి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.
దివి పోషించిన పాత్రను మలయాళంలో కూడా ఎవరో చిన్న నటి పోషించారు. అయితే ఇక్కడ మాత్రం కాస్త గ్లామర్ ఫేస్ ఉన్న దివి నటించడం ఆసక్తికరంగా మారింది. అది కూడా ఒక డీ గ్లామర్ రోజుల్లో ఒక చంటి పిల్లకు తల్లి పాత్రలో ఆమె నటించింది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి బ్రహ్మ అనే పాత్రలో నటించగా ఆయన అనుచరుడు కోటి అనే పాత్రలో సునీల్ నటిస్తారు. సునీల్ భార్యగా దివి కనిపిస్తుంది. ఆమె పేరు రేణుక కాగా ఆమె గర్భవతి అయిన తర్వాత బ్రహ్మ ఆధ్వర్యంలోనే నడిచే ఒక అనాధ ఆశ్రమంలో చేరుస్తాడు సునీల్.
అయితే డబ్బులకు కక్కుర్తి పడి తన భార్యను అంటే దివి వద్యతాను బ్రహ్మ పాడుచేసి కడుపు చేశాడు అంటూ మీడియా ముందు చెప్పిస్తాడు. తరువాత తప్పు తెలుసుకుని వెనక్కి తగ్గుతాడు. అయితే దివి అవకాశం ఇచ్చి మొత్తం మీద మెగాస్టార్ మాట నిలబెట్టుకున్నారనే వార్త ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ రావడంతో మెగా ఫ్యాన్స్ అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి సినిమా కలెక్షన్ల మీద మెగా ఫ్యాన్స్ అందరూ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
Also Read: Mega hero in God Father: చిరంజీవి కాకుండా గాడ్ ఫాదర్ లో మరో మెగా హీరో.. ఏ పాత్రలో నటించాడో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook