Differences Between Lucifer Movie and God Father Movie in Telugu: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సంపాదించింది. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కూడా నటించడంతో సినిమాని తెలుగుతో పాటు హిందీలో కూడా విడుదల చేశారు. కొద్ది రోజులు ఆగి సినిమాను తమిళంలో కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ సంగతి పక్కన పెడితే మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన లూసిఫర్ సినిమాని తెలుగులోకి రీమేక్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.
అయితే ఆ జాగ్రత్తలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. నిజానికి మలయాళ లూసిఫర్ సినిమా చాలా పద్ధతిగానే అనిపిస్తుంది. అయితే తెలుగు ప్రేక్షకులకు మదిలో మాత్రం కొన్ని ప్రశ్నలు గానీ మిగిలిపోతాయి. ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెబుతూ గాడ్ ఫాదర్ సినిమా రూపొందించారు దర్శకుడు మోహన్ రాజా. మలయాళ మాతృకలో మోహన్ లాల్ సచిన్ కేడ్కర్ కుమారుడిగా కొన్ని సీన్లలో అనిపిస్తారు. కొన్ని సీన్లలో మాత్రం తన గురువుగా ఆయనని సంభోదిస్తూ ఉంటారు. ఈ విషయంలో చాలామందిలో కన్ఫ్యూజన్ ఉంది.
ఆ కన్ఫ్యూజన్ మొత్తాన్ని తీర్చి వేసేలా తెలుగు వర్షన్ రూపొందించారు. తెలుగు వర్షన్ లో మెగాస్టార్ చిరంజీవి బ్రహ్మ పాత్ర పికేఆర్ సొంత కుమారుడని మొదటి భార్య సంతానమని క్లారిటీ ఇచ్చారు. అలాగే మలయాళంలో టోవీనో థామస్ నటించిన జతిన్ రామదాసు అనే పాత్రను పూర్తిగా తొలగించి తెలుగులో ఆ పాత్ర లేకుండా చేశారు. అలాగే ఆ పాత్ర చుట్టూ జరిగిన డ్రామా కూడా దాదాపుగా తప్పించినట్లు అయింది. అదే విధంగా మలయాళంలో సానియా అయ్యప్పన్ మంజు వారియర్ కుమార్తె పాత్రలో కనిపిస్తూ ఉంటారు.
ఆమెను చెరబెట్టేందుకు తండ్రి వరస అయ్యే వివేక్ ఒబెరాయి ప్రయత్నిస్తాడు. కానీ తెలుగు ఆడియన్స్ ఎంత సవతి కూతురు అయినా తండ్రి చెరబెట్టేందుకు ప్రయత్నిస్తే రిసీవ్ చేసుకోరు అనుకున్నారో ఏమో తెలియదు కానీ మలయాళం లో కూతురు పాత్రని తెలుగులో చెల్లెలి పాత్రగా చేశారు. తెలుగులో ఈ పాత్రను తాన్యా రవిచంద్రన్ పోషించారు. నయనతార చెల్లెలుగా సత్యదేవ్ చెరబెట్టేందుకు ప్రయత్నించే యువతిగా ఆమె కనిపించారు. ఇక ఇవి కాకుండా తెలుగులో ఒక ఐటెం సాంగ్ కూడా కలపడం ఆసక్తికరంగా మారింది.
నిజానికి అక్కడ ఐటెం సాంగ్ అక్కర్లేదు కానీ కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేయడం కోసమే బహుశా సినిమాలో ఐటెం సాంగ్ కలిపి ఉంటారేమో అనిపిస్తుంది. ఆ ఐటమ్ సాంగ్ కూడా కాస్త ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. అలాగే ఒరిజినల్ లూసిఫర్ సినిమాలో మోహన్ లాల్ సినిమా క్లైమాక్స్ లో వేరే దేశానికి వెళ్ళినట్టు చూపినట్లుగానే గాడ్ ఫాదర్ క్లైమాక్స్ లో కూడా చూపిస్తారు. కానీ గాడ్ ఫాదర్ క్లైమాక్స్ లో ప్రపంచంలో ఉన్న డ్రగ్స్ డీలర్స్ అందరినీ పిలిపించి వారందరినీ చంపినట్లుగా చూపిస్తారు. కానీ ఒరిజినల్ లూసిఫర్ వర్షన్లో మాత్రం సీక్వెల్ కోసం లీడ్ వదిలినట్టుగా కనిపిస్తుంది కానీ తెలుగు గాడ్ ఫాదర్ వర్షన్ పూర్తిగా క్లోజ్ చేసినట్లు అనిపిస్తుంది.
Also Read: Lucifer Vs God Father : లూసిఫర్లో అక్కడెవరు, గాడ్ ఫాదర్లో ఇక్కడెవరు? - ఫుల్ డీటెయిల్స్!
Also Read: The Ghost Movie Review : నాగార్జున ది ఘోస్ట్ మూవీ రివ్యూ.. రోస్ట్ చేసేశాడుగా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook