Chiranjeevi Manager Gangadhar : చిరంజీవి మేనేజర్ తల్లి అదృశ్యం.. విన్నపం చేసిన గంగాధర్
Gangadhar Mother Missing Case మెగాస్టార్ చిరంజీవి మేనేజర్ గంగాధర్‌కు కష్టం వచ్చిపడింది. తన తల్లి జ్ఞాపక శక్తి కోల్పోవడంతో అర్దరాత్రి తెలియకుండా ఇంట్లోంచి బయటకు వెళ్లిందట. దీంతో తన తల్లి ఆచూకి కోసం అతను ప్రయత్నాలు చేస్తున్నాడు.
Chiranjeevi Manager Gangadhar : చిరంజీవి మేనేజర్‌గా గంగాధర్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. గత ఏడాది మిత్రా శర్మ కోసం గంగాధర్ బిగ్ బాస్ స్టేజ్ మీదకు వచ్చాడు. ఓ సందర్భంగా ఆచార్య సినిమాపై చేసిన వీడియో వైరల్ అయింది. అలా గంగాధర్ అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తుంటాడు. అయితే తాజాగా తన తల్లి అదృశ్యమైందంటూ గంగాధర్ కుంగిపోయాడు.
నరాలశెట్టి గంగాధర్ తల్లి నరాలశెట్టి సత్యవతి (పాపాయమ్మ) అదృశ్యమయ్యారు. ఆమె వయసు సుమారు 85 సంవత్సరాలు. శనివారం అర్ధరాత్రి నుంచీ ఆమె కనిపిచండం లేదని గంగాధర్ మీడియాకు తెలిపారు. జ్ఞాపక శక్తి కోల్పోయిన కారణంగా అర్ధరాత్రి తెలియకుండా ఇల్లు విడిచి ఎటో వెళ్లిపోయారని చెప్పారు. ఎవరికైనా కనిపించినా.. ఆమెలా అనిపించినా వెంటనే తనకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన మీడియాకు ఓ నోట్ వదిలారు.
[[{"fid":"248055","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
ఈ ఫోటోలోని మా అమ్మ గారు శనివారం అర్ధరాత్రి నుంచీ కనిపించుట లేదు. జ్ఞాపక శక్తి కోల్పోయిన కారణంగా అర్థరాత్రి తెలియకుండా ఇల్లు విడిచి ఎటో వెళ్లిపోయారు. మీకు ఎవరికైనా కనిపించిన తన లా మీకు అనిపించినా కానీ వెంటనే మాకు తెలియచేయగలరు.
పేరు- నరాలశెట్టి సత్యవతి (పాపాయమ్మ). వయసు- 85 పైన.
ఎవరికైనా కనిపిస్తే, ఈ సెల్ నెంబర్లకు ఫోన్ చేయవలసిందిగా కోరుచున్నాం!
నరాలశెట్టి గంగాధర్
(చిరంజీవి గారి మేనేజర్)
సెల్ : 9866776669
అడ్రస్ :
కొమరగిరి కొలవరి మెరక
ఐ పోలవరం మండలం
ఈస్ట్ గోదావరి జిల్లా
Also Read : Nayanthara surrogacy: వివాదంలో నయనతార 'అమ్మతనం'.. అలా ఎలా అంటూ నోటీసులు?
Also Read : Pushpa - FilmFare Awards : ఊడ్చిపారేసిందట.. 'పుష్ప'పై అల్లు అర్జున్ ట్వీట్