Acharya Movie Ticket Prices Hiked In Telangana for 7 days: స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ నటించిన తాజా చిత్రం​ 'ఆచార్య'. సురేఖ కొణిదెల సమర్పణలో నిరంజన్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 29న థియేట‌ర్ల‌లో గ్రాండ్‌గా విడుద‌ల కానుంది. ఇప్పటికే చిత్ర బృందం వరుస ప్రమోషన్స్‌లో పాల్గొంటూ భారీ హైప్ తీసుకొచ్చింది. ఇక తాజాగా ఆచార్య సినిమాకు తెలంగాణ ప్రబుత్వం గుడ్ న్యూస్ తెలిపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణ రాష్ట్రంలో ఆచార్య సినిమాకు టికెట్‌ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఏప్రిల్ 29 నుంచి మే 5 వరకు ధరలు పెంచుకునేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ సర్కార్ నిర్ణయంతో ఒక్కో టికెట్‌పై మల్టీఫ్లెక్స్‌లో రూ. 50, ఏసీ థియేటర్లలో రూ.30 పెంచుకునేందు అనుమతి ఇచ్చింది. మరోవైపు వారం రోజుల పాటు ఆచార్య ఐదో ఆట ప్రదర్శనకు కూడా తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


ఆచార్య విడుద‌ల తేదీ స‌మీపిస్తున్న కొద్దీ.. ఈ సినిమాకు సంబంధించి ఏదో ఒక క్రేజీ అప్‌డేట్ అభిమానులను అలరిస్తూనే ఉంది. సినిమా ర‌న్నింగ్‌ టైం సుమారు 3 గంట‌లు ఉందని సమాచారం తెలుస్తోంది. రన్ టైమ్‌ 2 గంటల 46 నిమిషాలంటూ గతంలో కొంత ప్రచారం జరిగింది. ఈ విషయంపై చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటిస్తే తప్ప.. స్పష్టత వచ్చే అవకాశం లేదు. ఇక ఆచార్య చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్‌ కేవ‌లం లాహే లాహే పాట‌లోనే క‌నిపించ‌నుంద‌ని సమాచారం తెలుస్తోంది.


Also Read: TS Police Age Limit: పోలీసు ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ జారీ.. కానిస్టేబుల్, ఎస్సై వయో పరిమితి వివరాలు ఇవే!


Also Read: Rohit Sharma Note: నేను ఈ జట్టును ప్రేమిస్తున్నా.. రోహిత్ శర్మ భావోద్వేగం!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.