Chiranjeevi Acharya Runtime: మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలిసి నటించిన 'ఆచార్య' సినిమా ఈ నెల 29న విడుదలకు సిద్ధమవుతోంది. విడుదల తేదీ దగ్గరపడటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో చిరంజీవి బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం రన్ టైమ్‌పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది. చిత్ర నిడివి 154 నిమిషాల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా రన్ టైమ్‌పై ఇప్పటికైతే చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆచార్య మూవీ రన్ టైమ్‌ 2 గంటల 46 నిమిషాలంటూ ఇదివరకు కొంత ప్రచారం జరిగింది. చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటిస్తే తప్ప... ఈ విషయంలో పూర్తి స్పష్టత వచ్చే అవకాశం లేదు. ఆచార్య సినిమాలో మెగాస్టార్, రాంచరణ్ ఇద్దరు పవర్ఫుల్ రోల్స్‌లో కనిపిస్తుండటంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. నక్సల్ నేపథ్యం, ధర్మస్థలి అనే అమ్మవారి ఆలయానికి సంబంధించిన కథతో ఈ సినిమా సాగనుంది.సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.


ఇక ఈ సినిమాలో కాజల్ పాత్ర లేదని దర్శకుడు కొరటాల శివ క్లారిటీ ఇచ్చేశాడు. నక్సల్ పాత్రకు ప్రేమ కథను జోడించడం సరికాదని భావించి... ఆ పాత్రను తొలగించినట్లు చెప్పారు. కాజల్ పాత్ర అవసరం లేదని మొదట చిరంజీవితో చెబితే... కథకు ఏది అవసరమో అది చేయమని చిరు చెప్పారన్నారు. కాజల్‌ను తప్పించడంతో ఈ సినిమాలో పూజా హెగ్డే మాత్రమే హీరోయిన్‌గా కనిపించనుంది. సినిమాలో తనికెళ్ల భరణి, సోనూ సూద్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. చిరంజీవి, కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యానర్స్‌పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. 


Also Read: Weather Alert: తెలంగాణకు రాగల 3 రోజులు వర్ష సూచన... రాయలసీమలో తేలికపాటి వర్షాలు..


Also Read: World Malaria Day 2022: మలేరియా దినోత్సవం సందర్భంగా స్పెషల్‌ స్టోరీ..మలేరియా లక్షణాలు, నివారణ చర్యలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.