Chiranjeevi Salman Khan Godfather Twitter Review గాడ్ ఫాదర్ సినిమా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఆల్రెడీ యూఎస్ ఆడియెన్స్ సినిమాను చూసేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ముందుగానే షోలు పడ్డాయి. దీంతో సోషల్ మీడియాలో గాడ్ ఫాదర్ ట్రెండ్ అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమా భారీ అంచనాలతో ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ గాడ్ ఫాదర్ సినిమా తెలుగు సహా హిందీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దసరా సందర్భంగా అక్టోబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలైంది. ఇక ఈ సినిమా మలయాళ లూసిఫర్ సినిమాకు తెలుగు రీమేక్ గా రూపొందింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిజానికి మలయాళ లూసిఫర్ తెలుగు వర్షన్ కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉండడంతో మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో ఎలా నటించారనే విషయం మీద సర్వత్రా అందరిలో ఆసక్తి నెలకొంది. తెలుగులో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఒక సినిమాని మళ్లీ రీమేక్ చేయడం అనేది కత్తి మీద సాము అని చెప్పాలి. అయితే మెగాస్టార్ ఆ చాలెంజ్ తీసుకున్నారు. మోహన్ రాజా డైరెక్షన్ లో ఎన్వి ప్రసాద్, ఆర్బీ చౌదరి, రామ్ చరణ్ నిర్మాతలుగా గాడ్ ఫాదర్ సినిమా రూపొందింది. ఇక ఈ సినిమాలో సల్మాన్ ఖాన్, నయనతార, సునీల్, సముద్ర ఖని, పూరీ జగన్నాథ్, గెటప్ శ్రీను వంటి వారి కీలక పాత్రలలో నటించారు. 


 




 




 




 




 



ఇక ఈ సినిమాకి సంబంధించిన పలువురు అభిప్రాయాలూ, ప్లస్సులు, మైనస్సులు ఎలా ఉన్నాయనే విషయం మీద ఒక్కువేద్దాం. ఈ సినిమా మెగాస్టార్ గబ్బర్ సింగ్ అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. ఇప్పటివరకు రీఎంట్రీలో బెస్ట్ పెర్ఫార్మెన్స్ అంటూ సదరు నెటిజన్ పేర్కొన్నారు మనం చెప్పగలిగేది ఒక్కటే బాస్ ఇస్ బ్యాక్ అంటూ సదరు నెటిజన్ పేర్కొనడం ఆసక్తికరంగా మారింది. ఇక మ్యూజిక్ ఇచ్చిన తమన్ సినిమాని మరో లెవల్ కు తీసుకువెళ్లారని ఆయన కామెంట్ చేశారు. ఇక ఈ దసరాకి బాక్సాఫీస్ నుంచి దీపావళి వరకు బాస్ కంట్రోల్ లో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మరొక నెటిజన్ ద కింగ్ ఈజ్ బ్యాక్ అంటూ ఈ సినిమా గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలాగే మరో నెటిజన్ ఈ సినిమాలో చిరంజీవికి పడింది పర్ఫెక్ట్ రోల్ అని ఆయన స్క్రీన్ ప్రజెన్స్ అద్భుతంగా ఉందని కామెంట్ చేశారు.


సుమారు నాలుగు దశాబ్దాల తర్వాత కూడా ఆ ఏజ్ లో చిరంజీవి ఇంకా జనాన్ని మెస్మరైజ్ చేస్తున్నారంటే ఆయన ఒక లెజెండ్ అంటూ ఆయన కామెంట్ చేశారు. అలాగే వెనక్కి తగ్గిన సముద్రం ముందుకు వచ్చి సునామీ ఎలా ముంచేస్తే ఎలా ఉంటుందో తెలుసా అంటూ మరో నెటిజన్ ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కంటే పెద్ద హిట్ మెగాస్టార్ కొట్టబోతున్నారు అంటూ కామెంట్ చేశారు. మరో నెటిజన్ మాత్రం గాడ్ ఫాదర్ ఒరిజినల్ లూసిఫర్ కంటే బాగుందని కామెంట్ చేస్తున్నారు. చిరు, తమన్, సత్యదేవ్, ఆకట్టుకున్నారని మరో నెటిజన్ కామెంట్ చేశారు.


 


 




 





  


 


ఇక ఇప్పటివరకు రేటింగ్స్ ఇచ్చిన వారందరూ 3.5 పైనే ఇస్తున్నారు. ఇక మరో నెటిజన్ ఫస్ట్ ఆఫ్ గాడ్ ఫాదర్ ను లూసిఫర్ నుంచి బాగా అడాప్ట్ చేశారని అవన్నీ మెగాస్టార్ ఇమేజ్ కి బాగా సూట్ అయ్యి బాగా వర్క్ అవుట్ అయిందని పేర్కొన్నారు. మెగాస్టార్ ఇంట్రడక్షన్ అద్భుతంగా ఉందని అలాగే సినిమా స్క్రీన్ మీద నజభజ సాంగ్ కూడా టెర్రిఫిక్ గా ఉందని కామెంట్స్ వస్తున్నాయి. ఇంటర్వెల్ పోర్షన్ కూడా డీసెంట్ గానే ఉందని అంటున్నారు. సెకండ్ హాఫ్ కూడా డీసెంట్ గా ఎమోషన్స్ కి ఒక పర్ఫెక్ట్ అడ్డాగా ఉందని అంటున్నారు. సల్మాన్ఖాన్ ని బాగా వాడుకున్నారని పాలిటిక్స్ మీద బేస్ అయి ఉన్న డైలాగ్స్ ఆకట్టుకుంటాయని చెబుతున్నారు. మొత్తం మీద గాడ్ ఫాదర్ సినిమా మంచి పొలిటికల్ థ్రిల్లర్ అని, మాతృక లైన్ దాటకుండానే తెలుగు ఆడియన్స్ మెప్పించే విధంగా సినిమా ప్లాన్ చేశారని అంటున్నారు.


అలాగే మరో నెటిజన్ సినిమా కాస్త సాగదీసిన ఫీలింగ్ కలిగినా సరే దర్శకుడు మనల్ని ఎంగేజ్ చేసే విషయంలో మాత్రం చాలా శ్రద్ధ తీసుకున్నాడని బాక్సాఫీస్ వద్ద హిట్టు కొట్టేందుకు అన్నీ సమపాళ్లలో సిద్ధం చేసుకున్నాడని కామెంట్ చేశారు. ఇక మెగాస్టార్ చిరంజీవి చాలా సెటిల్ గా కన్విన్స్ అయ్యే విధంగా పర్ఫామెన్స్ ఇచ్చారని రీఎంట్రీలో ఆయన బెస్ట్ పెర్ఫార్మన్స్ ఈ సినిమాకి బాగా ప్లస్ అని సదరు నెటిజన్ కామెంట్ చేశారు. అలాగే తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రతి సీన్ ని ఎలివేట్ చేసిందని చెబుతున్నారు. 


Also Read: GodFather టైటిల్ పెట్టింది అతనా?


Also Read: Nagarjuna Akkineni - The Ghost : శివ, నిన్నే పెళ్ళాడతా సెంటిమెంట్లపై నాగ్


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitterమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  , Facebook