GodFather టైటిల్ పెట్టింది అతనా?.. అసలు విషయం చెప్పిన అనంత్ శ్రీరామ్

Chiranjeevi Godfather Title Secret  గాడ్ ఫాదర్ టైటిల్ సీక్రెట్‌ను తాజాగా లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ బయట పెట్టేశాడు. గాడ్ ఫాదర్ ప్రెస్ మీట్ ఈవెంట్లో భాగంగా ఆయన మాట్లాడుతూ.. గాడ్ ఫాదర్ టైటిల్ గురించి అసలు విషయాన్ని చెప్పేశాడు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 4, 2022, 09:06 PM IST
  • అక్టోబర్ 5న గాడ్ ఫాదర్ విడుదల
  • గాడ్ ఫాదర్ టైటిల్ సీక్రెట్ ఇదే
  • స్టేజ్ మీద అనంత్ శ్రీరామ్ స్పీచ్
GodFather టైటిల్ పెట్టింది అతనా?.. అసలు విషయం చెప్పిన అనంత్ శ్రీరామ్

Chiranjeevi Godfather Title : మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా రేపు అంటే అక్టోబర్ 5వ తేదీన విడుదల కాబోతోంది. నేటి వరకు ప్రమోషన్స్‌తో చిరంజీవి బిజీగానే ఉన్నాడు. ముంబైకి వెళ్లి సల్మాన్ ఖాన్‌తో కలిసి సినిమాను హిందీలోనూ ప్రమోట్ చేశాడు. అయితే సినిమాను చిరంజీవి ఏం చేయాలో అన్నీ చేశాడు. చిరు ఎంత చేసినా కూడా గాడ్ ఫాదర్ మీదున్న నెగెటివ్ ఇమేజ్ మాత్రం పోవడం లేదు. ఇక గాడ్ ఫాదర్ ప్రమోషన్స్‌లో ఆచార్య అపజయం గురించి స్పందిస్తూ.. అంతా డైరెక్టర్ మీదకు నెట్టేయడం కూడా నెగెటివ్ ఇమేజ్ తెచ్చిపెట్టేసింది.

ఒక వేళ గాడ్ ఫాదర్ కూడా తేడా కొట్టేస్తే.. అంతా కూడా మోహన్ రాజా మీదకు తోసేస్తారా? అంటూ నెటిజన్లు అనుకుంటున్నారు. అసలే ప్రతీ ఫ్రేముకు లూసిఫర్‌తో పోలికలు పెట్టేస్తున్నారు. రేపు సినిమా రిలీజ్ అయ్యాక అందరూ అదే చేస్తారు. ఎక్కడ ఎలాంటి మార్పులు చేశారు..అది కరెక్ట్ గానే ఉందా? లేదా ఒరిజినల్ సినిమాయే బాగుందా? అంటూ ఇలా రకరకాలుగా పోలికలు పెడుతుంటారు.

చాలాకొత్తగా ఫ్రెష్‌గా స్క్రీన్ ప్లే రాసుకున్నాను అని, ఇందులో దాదాపు పది సర్ ప్రైజ్‌లున్నాయంటూ మోహన్ రాజా ఈ చిత్రం గురించి ఎంతో ధీమాగా చెబుతున్నాడు. రేపు సినిమా విడుదలైతేగానీ అసలు విషయం ఏంటో తెలీదు. అయితే తాజాగా గాడ్ ఫాదర్ సినిమా టైటిల్ సీక్రెట్ చెప్పేశాడు అనంత్ శ్రీరామ్.

గాడ్ ఫాదర్ అనే టైటిల్‌ను తమన్ సజెస్ట్ చేశాడట. చిరంజీవికి గాడ్ ఫాదర్ అనే టైటిల్ బాగా సూట్ అవుతుందని, టీం అందరికీ నచ్చ జెప్పాడట. గాడ్ ఫాదర్ టైటిల్ పెట్టించాడట. మొత్తానికి తమన్ కోరిక మేరకు గాడ్ ఫాదర్ టైటిల్ పెట్టినట్టు అనంత్ శ్రీరామ్ ఇలా చెప్పేశాడు. మరి ఈ కథకు అయితే గాడ్ ఫాదర్ టైటిల్ సెట్ అవుతంది. కానీ ఈ కథలో చిరంజీవి ఏమేరకు మెప్పిస్తాడు.. మోహన్ లాల్‌ను మైమరిపిస్తాడా? లేదా? అన్నది చూడాలి.

Also Read : Allu Arjun - Ram Charan : రా రా.. రా పక్కన కూర్చోరా!.. వీడియో వైరల్

Also Read : Adipurush Teaser : టీజర్ ట్రోల్స్‌పై ఓం రౌత్ రియాక్షన్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News