Sridevi Chiranjeevi Song మెగాస్టార్ చిరంజీవి శ్రుతి హాసన్ మంచు కొండల్లో పాడుకున్న పాట ఇప్పుడు బయటకు వచ్చింది. శ్రీదేవీ చిరంజీవి అంటూ సాగే ఈ పాట లీక్ మెగాస్టార్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ పాటను ఎలాంటి లొకేషన్లలో షూట్ చేశారో.. అక్కడ ఎంత చలిగా ఉందో.. మంచు లోయల అందాలను చూపిస్తూ మైనస్ 8 డిగ్రీల ఉష్ణోగ్రతలో షూట్ చేశామని చిరంజీవి చెప్పాడు. దీంతో ఈ పాట మీద అందరికీ మరింత ఆసక్తి ఏర్పడింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



ఈ పాటను నాలుగు గంటల ఐదు నిమిషాలకు రిలీజ్ చేస్తామని చెప్పింది చిత్రయూనిట్. కానీ ఆలస్యం చేశారు. ఏదో సాంకేతిక సమస్యల కారణంగా సాంగ్ ఆలస్యంగా వస్తుందని, మీ ఎదురుచూపులకు తగ్గట్టుగానే అద్భుతంగా సాంగ్ ఉంటుందని మైత్రీ ఓ ట్వీట్ వేసింది. దీంతో మెగా అభిమానులు మైత్రీ మీద మండి పడుతున్నారు.


అసలు గత ఏడాది మైత్రీ, యూవీ క్రియేషన్స్‌ ఫ్యాన్స్ నుంచి తీవ్ర స్థాయిలో నెగెటివిటీని చవి చూసింది. పుష్ప అప్డేట్లు ఇవ్వలేక మైత్రీ, రాధే శ్యామ్ అప్డేట్లను ఆలస్యం చేస్తూ యూవీ క్రియేషన్స్‌ అభిమానులతో ఆడుకున్నాయి. దీంతో ఫ్యాన్స్ ఈ రెండు సంస్థలను ఏకిపారేశారు. ఇక ఇప్పుడు శ్రీదేవీ చిరంజీవి పాట విషయంలోనూ మైత్రీ అలానే చేసింది. అందుకే మెగా అభిమానులు తీవ్ర స్థాయిలో ఊగిపోతోన్నారు.


బాలయ్య సుగుణ సుందరి అంటూ దుమ్ములేపేసిన సంగతి తెలిసిందే. ఈవయసులోనూ అదేం స్పీడు అంటూ అందరూ ఆశ్చర్యపోయారు. ఇక ఇప్పుడు జై బాలయ్య వర్సెస్ బాస్ పార్టీ మధ్య జరిగినట్టుగానే ఈ సుగుణ సుందరి వర్సెస్ శ్రీదేవీ చిరంజీవి పాట మధ్య కూడా పోటీ జరిగేలా ఉంది.


బాలయ్య వీర సింహా రెడ్డి, చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలు రెండు కూడా సంక్రాంతి బరిలోకి దిగబోతోన్నాయి. ఇప్పటికే థియేటర్లు బ్లాక్ చేసుకునే పనిలో మైత్రీ పడింది. ఈ రెండు సినిమాలను రిలీజ్ చేస్తుండటంతో మైత్రీకి థియేటర్ల సమస్యలు ఏర్పడేలానే కనిపిస్తున్నాయి. మరో వైపు దిల్ రాజు తన వారసుడు సినిమాకు నైజాం థియేటర్లను మాగ్జిమం బుక్ చేసేసుకుంటున్నాడట.


Also Read : Dhamaka Firts Review : ధమాకా రివ్యూ.. శ్రీ లీలను చూస్తే అలాంటి ఫీలింగ్.. ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ చెప్పిన హైపర్ ఆది


Also Read : Avatar 2 Box Office Collections : అవతార్ 2 సునామీ.. కలెక్షన్లు చూస్తే కచ్చితంగా షాక్ అవుతార్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook