Sridevi Chiranjeevi Song : బాస్ గ్రేస్ అదుర్స్.. దేవీ బీట్ సూపర్.. శ్రుతి అందాలు హైలెట్
Sridevi Chiranjeevi Song Out చిరంజీవి శ్రీదేవీది హిట్ కాంబో కావడంతో ఇప్పుడు వాల్తేరు వీరయ్యలో ఓ పాటను కూడా పెట్టేశాడు దేవీ శ్రీ ప్రసాద్. వాల్తేరు వీరయ్య సినిమా కోసం దేవీ మాస్ బీట్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రం నుంచి శ్రీదేవీ చిరంజీవి అంటూ రెండో పాటను రిలీజ్ చేశారు.
Sridevi Chiranjeevi Song Out మైత్రీ మూవీస్ అప్డేట్లు ఇవ్వడంలో కాస్త ముందూ వెనక్కూ వెళ్తుంటుందన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సారి చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా విషయంలోనూ అలానే చేసింది. నేటి సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకు వాల్తేరు వీరయ్య నుంచి రెండో పాటను రిలీజ్ చేస్తామని మేకర్లు ప్రకటించారు. అయితే అంతా ఆ పాట కోసం సిద్దంగా ఉన్నారు.
కానీ తీరా మైత్రీ మెల్లిగా ఓ ట్వీట్ వేసింది. సాంకేతిక కారణాల వల్ల పాట ఆలస్యం అవుతుందని తప్పించుకుంది. దీంతో అభిమానులు మైత్రీ మీద మండి పడ్డారు. మొత్తానికి ఇప్పుడు ఈ పాటను విడుదలచేశారు. కాస్త ఆలస్యం అయినా కూడా పాట మాత్రం అదిరిపోయిందని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
మంచు కొండల్లో తాము మైనస్ 8 డిగ్రీల ఉష్ణోగ్రతలో షూట్ చేశామని చిరంజీవి చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ లిరికల్ వీడియోలో ఆ మంచు అందాలే హైలెట్ అయ్యాయి. ఇక బిగ్ స్క్రీన్ మీద ఈ పాట మాత్రం విజువల్ ఫీస్ట్‌గానే ఉండేట్టు కనిపిస్తోంది.
అటు బాలయ్య సుగుణ సుందరి అంటూ స్టెప్పులు వేశాడు. ఇటు చిరంజీవి అయితే శ్రీదేవీ అంటూ స్టెప్పులు వేశాడు. అసలే బాస్ పార్టీ సాంగ్ పై చేయి సాధించి జై బాలయ్య పాటను పక్కన నెట్టేసినట్టు అయింది. ఇప్పుడు ఈ రెండు పాటల్లో ఏది హైలెట్ అవుతుందో చూడాలి. ఆల్రెడీ సుగుణ సుందరికి అయితే పాజిటివ్ టాక్ వచ్చింది. మరి శ్రీదేవీ చిరంజీవి పాటకు ఇరవై నాలుగు గంటల్లో ఎన్ని వ్యూస్ వస్తాయి.. ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.
ఏది ఏమైనా కూడా బాలయ్య, చిరులు మాత్రం సంక్రాంతికి బాక్సాఫీస్ పని పట్టేలానే ఉన్నారు. ఈ రెండు సినిమాల్లో ఏ సినిమాకు కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్ల వర్షం కురవడం ఖాయం. ఒక వేళ రెండు సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం కలెక్షన్ల సునామీనే వచ్చే అవకాశం ఉంది.
Also Read : Kannada Star Darshan : స్టార్ హీరో దర్శన్‌పై చెప్పు విసిరిన ఆకతాయిలు.. బాధ కలిగించిందన్న శివ రాజ్‌కుమార్
Also Read : Sridevi Chiranjeevi Song : శ్రీదేవీ చిరంజీవి సాంగ్ ఆలస్యం.. మైత్రీని ఆడుకుంటున్న ఫ్యాన్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook