Chiranjeevi Waltair Veerayya Title Song మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య నుంచి ఇది వరకు రెండు పాటలు వచ్చాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో బాస్ పార్టీ ట్రెండింగ్‌లో ఉంది. ఆల్రెడీ ముప్పై మిలియన్ల వ్యూస్‌ను క్రాస్ చేసింది. చిరంజీవి శ్రీదేవీ సాంగ్ సైతం క్లిక్ అయింది. అయితే చిరంజీవి శ్రీదేవీ సాంగ్‌ను చెప్పిన టైంకు కాకుండా కాస్త ఆలస్యంగా రిలీజ్ చేశారు. ఇప్పుడు వీరయ్య టైటిల్ సాంగ్ విషయంలోనూ అలానే చేశారు. 7:02 గంటలకు రిలీజ్ చేస్తామని చెప్పారు. కానీ చెప్పిన టైంకు మాత్రం రిలీజ్ చేయలేకపోయారు. దీంతో మెగా ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



ఏది ఏమైనా కాస్త ఆలస్యంగా అయినా కూడా ఇప్పుడు మూడో పాటను రిలీజ్ చేశారు. వాల్తేరు వీరయ్య టైటిల్‌ సాంగ్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ ఈ పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. చంద్రబోస్ లిరిక్స్, దేవీ ట్యూన్ విని అంతా ఫిదా అవుతున్నారు. 


 ఇక ఇందులో చంద్రబోస్ రాసిన కొన్ని పదాలు చూసి ఫ్యాన్స్‌కు మెంటలెక్కేస్తోంది. సముద్ర సోదరుడు, తుఫాను అంచున తపస్సు చేసే వశిష్ఠుడు వంటి పదాలు కిరాక్ ఉన్నాయ్ అని, ఎలివేషన్స్ అదిరిపోయాయ్ అని చెబుతున్నారు.


మొత్తానికి బాలయ్య వీర సింహా రెడ్డి నుంచి వచ్చిన మూడు పాటలు, వాల్తేరు వీరయ్య నుంచి రెండు పాటల మధ్య పోటీ బాగానే జరిగింది. ఈ మూడు పాటల వ్యూస్ మొత్తం వాల్తేరు వీరయ్య బాస్ పార్టీ అంత కూడా వ్యూస్‌ను సాధించలేకపోయాయి. మా బావ మనోభావాలు అనే పాటకు వీరయ్య టైటిల్ సాంగ్ పోటీ నెలకొంది. ఈ రెండింట్లో ఏది బెటర్ అన్నది జనాలు నిర్ణయిస్తారో చూడాలి. ఈ రెండింట్లో ఏది రికార్డ్ వ్యూస్ కొల్లగొడుతుందో చూడాలి.


సినిమాలు రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పోటీ ఉండే వరకు ఇలాంటి చర్చలు నడుస్తూనే ఉంటాయి. ఇప్పుడు అయితే పాటల మధ్య పోటీలు నడుస్తున్నాయి. ఆ తరువాత ట్రైలర్‌ల మధ్య పోటీ ఉంటుంది. ఏ ట్రైలర్ ఎలా ఉంది? ఏ ట్రైలర్‌కు ఎన్ని వ్యూస్ వచ్చాయంటూ నెటిజన్లు పోలికలు పెడుతూనే ఉంటారు. ఇక సంక్రాంతి బరిలో అయితే ఈ రెండు సినిమాలకు మంచి బజ్ ఉంది. ఏ సినిమాకు ఎలాంటి టాక్ వచ్చి.. ఎలాంటి కలెక్షన్లను కురిపిస్తాయో చూడాలి. ఏది హిట్ అయినా ఏది ఫట్ అయినా కూడా ఎఫెక్ట్ మాత్రం మైత్రీ మీదే పడుతుంది.


Also Read : Sushant Singh Rajput post mortem : సుశాంత్ సింగ్‌ది ఆత్మహత్య కాదు.. హత్యే!.. పోస్ట్ మార్టం చేసిన వ్యక్తి చెప్పాడట.. ట్వీట్ వైరల్


Also Read : Prabhas Sukumar Movie : ప్రభాస్ సుకుమార్‌ కాంబో ఫిక్స్.. కోట్లలో అడ్వాన్స్‌ ఇచ్చేశారట


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook