Chiranjeevi Tweet: కంటెంట్ బాగుంటే.. ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు! చిరంజీవి ట్వీట్ వైరల్
Chiranjeevi Happy for Bimbisara, Sita Ramam movies success. సీతారామం, బింబిసార చిత్రాలు ఘన విజయం సాధించడంతో మెగాస్టార్ చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు.
Chiranjeevi Happy for Bimbisara, Sita Ramam movies success: చాలా రోజుల తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లు ప్రేక్షకులతో కళకళలాడుతున్నాయి. పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్, కేజీఎఫ్, మేజర్, విక్రమ్ సినిమాల తర్వాత శుక్రవారం (ఆగష్టు 5) సినీ ప్రియులు థియేటర్‌లకు క్యూ కట్టారు. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన 'బింబిసార', యుద్ధం నేపథ్యంలో రూపుదిద్దుకున్న లవ్ స్టోరీ 'సీతారామం' సినిమాలు చూసేందుకు భారీ స్థాయిలో వచ్చారు. శుక్రవారం విడుదలైన ఈ రెండు సినిమాలు మొదటి షో నుంచే మంచి టాక్ తెచ్చుకుని ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్నాయి. సీతారామం, బింబిసార చిత్రాలు ఘన విజయం సాధించడంతో మెగాస్టార్ చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు.
కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని మరోసారి నిరూపితం అయిందని చిరంజీవి ట్వీట్ చేశారు. 'ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదని బాధపడుతున్న చిత్ర పరిశ్రమకు ఊరట. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులెప్పుడూ ఆదరిస్తారని మరోసారి నిరూపిస్తూ.. శుక్రవారం విడుదలైన రెండు చిత్రాలు విజయం సాధించడం ఎంతో సంతోషకరం. సీతారామం, బింబిసార సినిమా నటీనటులు, నిర్మాతలు, సాంకేతిక బృందానికి నా హృదయ పూర్వక శుభాకాంక్షలు' అని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా సీతారామం, బింబిసార చిత్రాల ఘన విజయంపై సంతోషం వ్యాకులతం చేశారు. 'ఒకే రోజు విడుదలైన సీతారామం, బింబిసార సినిమాలు విజయం అందుకున్నాయని తెలిసి చాలా ఆనందంగా ఉంది. చాలా మంచి రోజు ఇది. వైజయంతి మూవీస్, హను రాఘవపూడి, దుల్కర్ సల్మాన్, సుమంత్, మృణాల్, రష్మిక అందరికీ అభినందనలు. మీ సినిమా గురించి ఎన్నో అద్భుతమైన విషయాలు వింటున్నా. విశేష ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న బింబిసార చిత్రం టీమ్ నందమూరి కల్యాణ్ రామ్, వశిష్ఠ, సంయుక్త మీనన్, కేథరిన్ థెస్రా.. ఇతర చిత్ర బృందంకు శుభాకాంక్షలు' అని విజయ్ ట్వీటారు.
Also Read: India Corona Update: అదుపులోనే కరోనా వైరస్ వ్యాప్తి.. కొత్త కేసులు ఎన్నంటే?
Also Read: Deepika Padukone:ఎన్నో సార్లు సూసైడ్ చేసుకోవాలనుకున్నా.. అమ్మ లేకుంటే అదే జరిగేది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook