India Corona Update: అదుపులోనే కరోనా వైరస్ వ్యాప్తి.. కొత్త కేసులు ఎన్నంటే?

India Reports 19406 new cases in Last 24 Hours. భారత దేశంలో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి అదుపులోనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 19,406 మంది వైరస్ బారిన పడ్డారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Aug 6, 2022, 10:33 AM IST
  • అదుపులోనే కరోనా వైరస్ వ్యాప్తి
  • కొత్త కేసులు ఎన్నంటే
  • రికవరీ రేటు 98.50 శాతం
India Corona Update: అదుపులోనే కరోనా వైరస్ వ్యాప్తి.. కొత్త కేసులు ఎన్నంటే?

India Corona Update: భారత దేశంలో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి అదుపులోనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 19,406 మంది వైరస్ బారిన పడ్డారు. 3.91 లక్షల మందికి వైద్య పరీక్షలు చేయగా.. 19,406 పాజిటివ్ కేసులు వచ్చాయి. మహమ్మారితో మరో 49 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక వైరస్ నుంచి 19,928 మంది కోలుకున్నారు. దేశంలో పాజిటివిటీ రేటు 4.96 శాతానికి చేరిందని కేంద్రం వెల్లడించింది. 

శుక్రవారం 19,406 మందికి వైరస్ సోకగా.. దేశ రాజధాని ఢిల్లీలో 2,419 మంది కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం క్రియాశీల కేసులు 1,34,793 లక్షలకు చేరుకున్నాయి. క్రియాశీల రేటు 0.31 శాతానికి తగ్గగా.. రికవరీ రేటు 98.50 శాతంగా ఉంది. శుక్రవారం 32.7 లక్షల మంది టీకా తీసుకున్నారు. ఇప్పటివరకూ 20,59,22,079 కోట్లకు పైగా టీకా పంపిణి అయింది. 

ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి కల్లోలం కొనసాగుతోంది. పలు దేశాల్లో కొత్త వైరస్​ కేసులు బయటపడుతూనే ఉన్నాయి. మహమ్మారితో చాలా మంది ప్రాణాలు విడుస్తున్నారు. జపాన్​, దక్షిణ కొరియాలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో వెలుగు చూస్తున్నాయి.  ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. 

Also Read: రేపే ఎస్సై ప్రిలిమ్స్‌ ఎగ్జామ్.. అభ్యర్థులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే!

Also Read: Today Gold Price August 6: మళ్లీ పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో నేటి పసిడి ధరలు ఇవే!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x