Chiranjeevi Twitter DP చిరంజీవి ప్రస్తుతం పుత్రోత్సాహంలో ఉన్నాడు. రామ్ చరణ్‌ నటించిన సినిమా, స్టెప్పులు వేసిన పాటకు ఆస్కార్ అవార్డ్ రావడంతో గాల్లో తేలిపోతోనన్నాడు. రామ్ చరణ్‌కి కాదు.. తనకే ఆస్కార్ అవార్డ్ వచ్చినంత గొప్పగా ఫీల్ అవుతున్నాడు చిరంజీవి. అయితే ఈ ఉత్సాహం కాస్తా.. అత్యుత్సాహంగా మారినట్టుంది. చిరంజీవి తన సోషల్ మీడియా ఖాతాల్లో డీపీని చేంజ్ చేశాడు. పూర్ ఎడిటింగ్ అంటూ జనాలు చిరంజీవి డీపీని ట్రోల్ చేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేవీ నాగవల్లిని కూడా జనాలు ఎలా ట్రోల్ చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం. చేతిలో ఆస్కార్‌లా కనిపించే డమ్మీ బొమ్మ పట్టుకుని పోజులు ఇవ్వడం, ప్రోగ్రాంలు చేయడం మీద జనాలు ఎలా ట్రోల్స్ చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం. కోఠిలో ఆస్కార్ అవార్డులను కూడా అమ్ముతున్నారా? అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇక చిరంజీవి తన డీపీని మార్చుకోవడం, అందులో ఎడిట్ చేసిన తీరుని జనాలు ఆడేసుకుంటున్నారు.


 



అయితే ఆస్కార్ సాధించిన తరువాత చిరంజీవి మీడియాతో మాట్లాడిన మాటలు కూడా ట్రోలింగ్‌కు గురయ్యాయి. ఈ విజయాన్ని ఒక్క రామ్ చరణ్‌కే ఆపాదించడం కరెక్ట్ కాదంటూ మాట్లాడిన మాటలు కాంట్రవర్సీకి దారి తీశాయి. దీంతో చిరు ఆ తరువాత వివరణ ఓ వీడియోను రిలీజ్ చేశాడు. దర్శక నిర్మాతలకు, పాట పాడిన సింగర్లు, కంపోజ్ చేసిన మాస్టర్, కీరవాణి, హీరోలకు ఇలా అందరికీ కూడా కంగ్రాట్స్ చెప్పాడు. ఇలా ప్రతీ ఒక్కరికి క్రెడిట్ ఇస్తూ ఆస్కార్ సాధించినందుకు అభినందనలు తెలిపాడు.


ఇలా ప్రతీ సారి చిరంజీవి ఏదో ఒకటి మాట్లాడటం, జనాలు ట్రోల్ చేయడం జరుగుతూనే వస్తోంది. ఇప్పుడు ఇలా సోషల్ మీడియాలో వింత డీపీతో దర్శనం ఇవ్వడంతో దాన్ని కూడా ట్రోల్ చేస్తున్నారు. అదేదో ఉత్సాహంలో, ఎగ్జైట్మెంట్‌లో చేసి ఉంటాడు.. మనకు ఆస్కార్ వచ్చిందనే సంతోషాన్ని తెలియజేసేందుకు అలాంటి డీపీ పెట్టి ఉంటారని మెగా అభిమానులు అంటున్నారు. దానికి కూడా ఇలా ట్రోల్ చేయాలా? అని నెటిజన్లను నిలదీస్తున్నారు.


Also Read:  Oscars 2023 Live Updates: ఆస్కార్ విజేతల జాబితా, ఎవరెవరికి ఏ అవార్డులు


Also Read: Oscars 2023: తెలుగోడి సత్తాచాటిన 'నాటు నాటు'. Naatu Naatu పాటను వరించిన ఆస్కార్ అవార్డు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook