Chiranjeevi - Varun Tej: చిరంజీవి తన కెరీర్‌లో చాలా మంది హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అందులో  పవన్ కళ్యాణ్, రామ్ చరణ్‌ సహా చాలా మంది ఫ్యామిలీ హీరోలు కూడా ఉన్నారు. ఇప్పటికే ఆచార్యలో చిరంరీజవి,రామ్ చరణ్‌లు కలిసి నటించారు. అటు లాస్ట్ ఇయర్ 'బ్రో' మూవీలో పవన్ కళ్యాణ్‌, సాయి ధరమ్ తేజ్‌లు ఒకే సినిమాలో కనిపించి అభిమానులు కనువిందు చేసారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లు కూడా 'శంకర్ దాదా జిందాబాద్‌' మూవీలో కలిసి యాక్ట్ చేశారు. అటు మరో మెగా హీరో వరుణ్ తేజ్.. సీనియర్ హీరో వెంకటేష్‌తో రెండు సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  కానీ తమ ఫ్యామిలీకి సంబంధించిన హీరోలతో మాత్రం నటించలేదు. కానీ వరుణ్ తేజ్ మాత్రం చిన్నపుడు తన పెదనాన్న చిరంజీవి, నాన్న నాగబాబు ముఖ్యపాత్రల్లో నటించిన 'హ్యాండ్సప్' మూవీలో బాల నటుడిగా తెరపై కనిపించాడు. ఈ సినిమాను శివనాగేశ్వరరావు డైరెక్ట్ చేసాడు. 


'హ్యాండ్సప్'  తర్వాత మరే సినిమాలో బాలనటుడిగా వరుణ్ తేజ్ నటించలేదు. ఆ తర్వాత హీరోగా ముకుందా సినిమాతో పరిచయమయ్యాడు. మెగా ఫ్యామిలీ ట్యాగ్ అనే కానీ.. ఎప్పటికప్పుడు డిఫరెంట్ మూవీస్‌తో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. లాస్ట్ ఇయర్ 'గాండీవధారి అర్జున' సినిమాతో పలకరించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. త్వరలో వరుణ్ తేజ్.. 'ఆపరేషన్ వాలెంటెన్' మూవీతో పలకరించబోతున్నాడు. ఈ సినిమాలో వరుణ్ తేజ్.. ఎయిర్ ఫోర్స్ అధికారి అర్జున్ రుద్రదేవ్ పాత్రలో కనిపించనున్నారు. రీసెంట్ హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కిన 'ఫైటర్' మూవీ కూడా ఇదే కాన్సెప్ట్‌ తెరకెక్కింది. పుల్వామా దాడి నేపథ్యంలో పాకిస్థాన్‌లోని  బాలాకోట్‌లో మన దేశ సైనికులు చేసిన సర్జికల్ స్ట్రైక్ ఆధారంగా తెరకెక్కించారు. ఇపుడు అదే కాన్సెప్ట్‌తో 'ఆపరేషన్ వాలెంటైన్' మూవీని తెరకెక్కించారు.ఈ సినిమా మార్చి 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. 


Also Read: FD Interest Rates: ఎఫ్‌డీలపై అత్యధికంగా 9.50 శాతం వరకూ వడ్డీ ఇచ్చే బ్యాంకులు ఇవే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.