Chiranjeevi Vs Balakrishna Sankranthi Boxoffice Fight History: మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ సంక్రాంతి సందర్భంగా వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి సినిమాలతో పోటీ పడుతున్నారు. ఇప్పుడు వీరు పదో సారి పోటీ పడుతూ ఉండగా వారిద్దరూ గతంలో తొమ్మిది సార్లు పోటీ పడ్డారు. ఆ తొమ్మిది సార్లు ఎవరు ఎక్కువ సార్లు గెలిచారు? అనే అంశం మీద ఒక లుక్కేద్దాం. మొట్టమొదటిసారిగా మెగాస్టార్ చిరంజీవి నందమూరి బాలకృష్ణ మధ్య 1985 సంక్రాంతికి పోటీ పడగా నందమూరి బాలకృష్ణ ఆత్మబలం, మెగాస్టార్ చిరంజీవి చట్టంతో పోరాటం అనే సినిమాతో వచ్చారు, అయితే ఈ రెండు సినిమాల్లో చిరంజీవి సినిమా హిట్ కొట్టింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ తర్వాత 1987లో చిరంజీవి దొంగ రాముడు అనే సినిమాతో నందమూరి బాలకృష్ణ భార్గవ రాముడు అనే సినిమాతో పోటీపడగా మళ్లీ మెగాస్టార్ చిరంజీవి హిట్టు కొట్టారు. అనంతరం 1988లో మెగాస్టార్ చిరంజీవి మంచి దొంగ అనే సినిమాతో రాగా అప్పుడు బాలకృష్ణ ఇన్స్పెక్టర్ ప్రతాప్ సినిమాతో వస్తే అప్పుడు కూడా మెగాస్టార్ మంచి దొంగ సూపర్ హిట్ అయింది. క 1997లో మెగాస్టార్ హిట్లర్ సినిమాతో బాలకృష్ణ పెద్దన్నయ్య సినిమాలతో పోటీ పడగా అప్పుడు రెండు సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఆ అనంతరం 1999లో మెగాస్టార్ చిరంజీవి స్నేహం కోసం సినిమాతో నందమూరి బాలకృష్ణ సమరసింహారెడ్డితో పోటీ పాడగా అప్పుడు బాలకృష్ణ సినిమా హిట్ అందుకుని ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.


ఇక మళ్ళీ ఆ ఏడాది తర్వాత బాలకృష్ణ వంశోద్ధారకుడు అనే సినిమాతో మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య సినిమాతో పోటీ పడగ అప్పుడు చిరంజీవి మరోసారి బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ సొంతం చేసుకున్నాడు. ఇక   2001లో నందమూరి బాలకృష్ణ నరసింహనాయుడు సినిమాతో మెగాస్టార్ చిరంజీవి మృగరాజు అనే సినిమాతో పోటీపడగా అప్పుడు నరసింహనాయుడు సూపర్ హిట్ అయింది. 2004లో బాలకృష్ణ లక్ష్మీనరసింహ అనే సినిమాతో మెగాస్టార్ చిరంజీవి అంజి సినిమాతో పోటీ పడగా బాలకృష్ణ మంచి హిట్ అందుకున్నారు.


ఇక 2017లో మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమాతో బాలకృష్ణ గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాతో పోటీ పడగా రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సొంతం చేసుకున్నాయి. ఈ లెక్కన నందమూరి బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతికి తొమ్మిది సార్లు పోటీ పడగా అందులో మెగాస్టార్ చిరంజీవి నాలుగుసార్లు, బాలకృష్ణ మూడు సార్లు పైచేయి సాధించగా రెండు సార్లు మాత్రం ఇద్దరి సినిమాలు హిట్ అయ్యాయి. 


Also Read: Waltair Veerayya Vs Veera Simha Reddy : సంక్రాంతి బాక్సాఫీస్ లెక్కలు.. ఎన్ని కోట్ల వ్యాపారం అంటే?


Also Read: Waltair Veerayya Copy Dialouge: 30 యియర్స్ పృధ్వి డైలాగ్ కాపీ కొట్టిన చిరు.. ఇదేందయ్యా ఇదీ!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook