Veera Simha Reddy Trailer నందమూరి బాలకృష్ణ వీర సింహా రెడ్డి, చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలకు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. అయితే బాలయ్య సినిమా కంటే ప్రతీసారి వాల్తేరు వీరయ్యకే వ్యూస్ ఎక్కువగా వస్తున్నాయి. వీర సింహా రెడ్డి పాటలు, వాల్తేరు వీరయ్య పాటలు నెట్టింట్లో బాగానే ట్రెండ్ అయ్యాయి. కానీ చిరంజీవి డీఎస్పీ కాంబోలో వచ్చిన పాటలే నెట్టింట్లో దుమ్ములేపేశాయి. అలా సోషల్ మీడియాలో ఎప్పుడూ కూడా బాలయ్య మీద చిరు పై చేయి సాధిస్తూనే వస్తున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ క్రమంలో మొన్న రిలీజ్ చేసిన బాలయ్య వీర సింహా రెడ్డి ట్రైలర్ మీద కూడా చిరంజీవి వాల్తేరు వీరయ్య పై చేయి సాధించింది. నిన్న వాల్తేరు వీరయ్య ట్రైలర్‌ను నెట్టింట్లో రిలీజ్ చేశారు. ఇందులో భాగంగా వీర సింహా రెడ్డి 24 గంటల్లో నమోదు చేసిన రికార్డ్స్‌ను వీరయ్య ఏడే ఏడు గంటల్లో కొల్లగొట్టి అవతల పారేశాడు. వాల్తేరు వీరయ్య ఇప్పటికీ నెట్టింట్లో దుమ్ములేపేస్తూ ఉన్నాడు.


వీర సింహా రెడ్డి సినిమా ట్రైలర్‌కు 24 గంటల్లో 8.01 మిలియన్ల వ్యూస్ రాగా.. 382.6K లైక్స్ వచ్చాయి. అదే వాల్తేరు వీరయ్య ట్రైలర్‌కు ఏడు గంటల్లోనే 9.1 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. 391K కి పైగా లైక్స్ వచ్చాయి. అంటే వాల్తేరు వీరయ్య ఇంకా మున్ముందు ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో అంచనా వేసుకోవచ్చు.


సోషల్ మీడియా రికార్డుల్లో అయితే బాలయ్య మీద చిరు పై చేయి సాధిస్తున్నాడు. మరి బాక్సాఫీస్ వద్ద ఎవరు ఎవరి మీద పై చేయి సాధిస్తారో చూడాలి. ఎవరి సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుందో.. ఎవరి సినిమాకు కలెక్షన్ల వర్షం కురుస్తుందో చూడాలి. అయితే ఈ రెండు చిత్రాలకు నిర్మాత మైత్రీనే కాబట్టి.. ఏ ఒక్క సినిమా క్లిక్ అయినా కూడా కలెక్షన్ల వర్షం కురవడం మాత్రం ఖాయమనిపిస్తోంది.


Also Read: Thala Ajith Family : అజిత్ ఫ్యామిలీ ఫోటోలు.. ఆయన కూతురు ఎలా ఉందో చూశారా?


Also Read: Roja Satires on Mega Family : ఏ ఒక్కరికీ సాయం చేయలేదట.. అందుకే ముగ్గుర్నీ ఓడించారట.. మంత్రి రోజా సంచలన కామెంట్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి