Waltair Veerayya Overseas collections మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా ఇప్పుడు వరల్డ్ వైడ్‌గా దుమ్ములేపేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఊచకోత కోసేస్తోంది. వంద కోట్లకు పైగా గ్రాస్, దాదాపు అరవై కోట్ల షేర్‌తో వాల్తేరు వీరయ్య దూసుకుపోతోంది. ఇక ఓవర్సీస్‌లో ఈ మూవీ కలెక్షన్లు చూసి అందరూ నోరెళ్లబెట్టేస్తున్నారు. చిరంజీవి దెబ్బ కొడితే బాక్సాఫీస్ ఎలా బద్దలవుతుందో వాల్తేరు వీరయ్యతో నిరూపించాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ సినిమాల స్థాయిలో నార్త్ అమెరికాలో కలెక్షన్లు రాబట్టేస్తున్నాడు. ఈ వీకెండ్‌లో బాక్సాఫీస్ వద్ద రఫ్పాడించిన పది చిత్రాల్లో మన వాల్తేరు వీరయ్య ఉంది. నార్త్ అమెరికాలో లాస్ట్ వీకెండ్ బాక్సాఫీస్ వద్ద అవతార్ ది వే ఆఫ్ వాటర్ టాప్ ప్లేస్‌లో ఉంది. ఆ లిస్ట్ అన్నీ హాలీవుడ్ సినిమాలే ఉన్నాయి. కానీ ఒకే ఒక్క ఇండియన్ సినిమా.. అది కూడా మన వాల్తేరు వీరయ్య ఉండటం విశేషం.


[[{"fid":"259567","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ఈ లిస్ట్‌లో ఉన్న ఏకైక చిత్రం వాల్తేరు వీరయ్య కావడం, అది కూడా మిలియన్ డాలర్ల కలెక్షన్లతో దూసుకుపోవడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే వీరయ్య సినిమా ఓవర్సీస్‌లో బ్రేక్ ఈవెన్ అయింది. ఈరోజు మార్నింగ్ వరకే ఈ చిత్రం 1.7 మిలియన్ డాలర్లను కొల్లగొట్టింది. రేపో మాపో ఈ సినిమా రెండు మిలియన్ల డాలర్లను కొల్లగొట్టేసి రేర్ ఫీట్‌ను అందుకోబోతోంది.


ఇక రెండో వారాంతం ముగిసే సరికి ఈ సినిమా రెండొందల కోట్ల గ్రాస్‌ ఈజీగా రాబట్టేలా కనిపిస్తోంది. మొత్తానికి చిరంజీవి కమ్ బ్యాక్ ఇచ్చాక ఈ రేంజ్‌ బ్లాక్ బస్టర్ సొంతం చేసుకోవడంతో ఫ్యాన్స్‌కు నిజంగానే పూనకాలు లోడింగ్ అవుతోంది. సైరా, ఆచార్య, గాడ్‌ ఫాదర్ సినిమాల దెబ్బను వీరయ్య పోగొట్టేలా కనిపిస్తున్నాడు. ఇక నాలుగు సినిమాలు వన్ మిలియన్ డాలర్ల క్లబ్బులో చేరుకోవడం కూడా చిరంజీవి ఖాతాలో ఓ రికార్డుగా చేరింది.


Also Read:  Veera Simha Reddy Break even : మరీ ఇంత దారుణమా?.. చిరు మీద ఇంత కక్షా?.. బాలయ్య మీద అంత ప్రేమనా?


Also Read: Chiranjeevi : సెట్‌కు వెళ్లే ముందు ఇంట్లో వంట మనిషితో.. ఆసక్తికరమైన విషయాన్ని చెప్పిన చిరంజీవి 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook