Tweet: అమితాబ్ తో చిరు ఏమన్నారు?
బాలీవుడ్ బాద్ షా అమితాబ్ బచ్చన్ కు కరోనా సోకిందని తెలియగానే సినీ పరిశ్రమ నివ్వెర పోయింది. అమితాబ్ తో పాటు తనయుడు అభిషేక్ సైతం కోవిడ్ 19 బారిన పడటంతో బాలీవుడ్ లో కలకలం రేగుతోంది. భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ సినీ దిగ్జజులు ట్వీట్స్ చేస్తున్నారు.

కోవిడ్ 19 బారిన పడిన బాద్ షా అమితాబ్ బచ్చన్ (77) త్వరగా కోలుకోవాలంటూ మెగాస్టార్ చిరంజీవి ఆకాంక్షించారు. అమితాబ్ త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్ధిస్తున్నట్టు చిరు తన ట్విట్టర్ లో తెలిపారు. All our best wishes and hearty prayers are with you Amit ji… అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.p>
“ నాకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. ఆస్పత్రిలో చేరాను. ఆస్పత్రి అధికారులు నాతోపాటు మా కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు చేయించారు. వారికి సంబంధించిన ఫలితాలు వెల్లడి కావల్సి ఉంది “ అంటూ అమితాబ్ స్వయంగా ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం కాస్సేపటికి అభిషేక్ బచ్చన్ కు కూడా కోవిడ్ పాజిటివ్ గా తేలడంతో అతను కూడా ఆస్పత్రిలో చేరాడు. గత పదిరోజులుగా తనను కలిసినవారు పరీక్షలు చేయించుకోవల్సిందిగా అమితాబ్ అదే ట్వీట్ లో విజ్ఞప్తి చేశారు. Also read: Amitabh Bachchan: అమితాబ్ బచ్చన్‌కు కరోనా పాజిటివ్.. ఆస్పత్రిలో చికిత్స